Chiranjeevi And Pawan Kalyan: ఎన్టీఆర్, నాగేశ్వరరావు ల తర్వాత అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ఏకైక హీరో చిరంజీవి.. ఆయన స్టార్ హీరోగా ఉన్నప్పుడే ఆయన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించాలని అనుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో పవన్ కళ్యాణ్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు.
అయితే దాని కోసం వినూత్నమైన పబ్లిసిటీని వాడినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ సిటీ లోని మెయిన్ ఏరియాల్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పెద్ద ఫోటోలు పెట్టి ‘ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?’ అనే టైటిల్స్ పెట్టారు. అలా పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ చేయడానికి ముందే చిరంజీవి తనని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇప్పుడున్నట్టుగా అప్పట్లో మీడియా ఇంత ఫాస్ట్ గా లేదు, అలాగే సోషల్ మీడియా అసలే లేదు. కాబట్టి పబ్లిసిటీ కోసం చిరంజీవి అలాంటి ట్రిక్ అయితే వాడాడు.
ఇక మొత్తానికైతే ఆ ఫోటోలు చూసిన చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు అని తెలుసుకున్న మెగా అభిమానుల ఆనందానికైతే అవధులు లేవనే చెప్పాలి. ఇక ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. ఇక మొత్తానికైతే తనను తాను స్టార్ హీరోగా మలుచుకోవడంలో పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు జనసేన పార్టీ అధినేతగా కూడా తన సత్తా చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ల లో కీలకమైన పాత్రను పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోపక్క వరుస సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు. ఇక ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి లాంటి సినిమాలు పూర్తి కావస్తున్నాయి.కాబట్టి వీటి తర్వాత చేయబోయే సినిమాలను కూడా ఇప్పుడే ప్రీ ప్లాన్డ్ గా రెడీ చేసి పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…