Chiranjeevi- Garikapati Controversy: గత వారం రోజులుగా గరికపాటి నరసింహారావు పేరు మీడియాలో మారుమ్రోగుతుంది. కారణం ఆయన చిరంజీవిని ఉద్దేశించి కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేయడమే. హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి ఈసారి చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది. దత్తాత్రేయ ఆహ్వానం మేరకు అలయ్ బలయ్ వేడుకకు చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన గరికపాటి నరసింహారావు చిరంజీవిపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి అభిమానులతో సెల్ఫీలు దిగుతున్నారు.

వేదికకు మరోవైపు జరుగుతున్న ఈ సంఘటనకు గరికపాటి స్పందించాల్సిన అవసరం లేదు. అయితే ఆయన ప్రసంగాన్ని సర్వజనులు సర్వేంద్రియాలు కేంద్రీకరించి వినాలనేది ఆయన కోరిక. దాంతో… చిరంజీవి గారు ఆ ఫోటో షూట్ ఆపకపోతే నేను వేదికపై నుండి వెళ్ళిపోతానని మైక్ లో గట్టిగా చెప్పారు. చిరంజీవి లాంటి వ్యక్తిని నరసింహారావు కించపరచడంతో అభిమానులు, చిత్ర ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. గరికపాటిని విమర్శించడం కూడా జరిగింది. నటుడు నాగబాబు పరోక్షంగా సోషల్ మీడియాలో గరికపాటిపై సెటైర్ వేశారు.
అయితే చిరంజీవి ఈ వివాదం గురించి మాట్లాడలేదు. సంఘటన జరిగిన రోజు కూడా సంయమనం పాటించారు. గరికపాటి ఒకింత అవమానించినా చిరంజీవి ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంటికి పిలిచి సన్మానించుకుంటానని చెప్పారు. కాగా మొదటిసారి చిరంజీవి గరికపాటి వ్యాఖ్యలపై స్పందించారు. లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్ లో చిరంజీవిని మీడియా ప్రముఖులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. గరికపాటి నరసింహారావు పెద్దాయన, ఆయన వ్యాఖ్యలపై చర్చ అనవసరం అన్నారు.
ఆయన పెద్ద పండితుడు, మంచీ చెడులకు తారతమ్యం తెలిసినవారు. కాబట్టి ఈ వివాదం గురించి మాట్లాడవలసిన అవసరం లేదని మరోసారి చిరంజీవి తన హుందాతనం చాటుకున్నారు. పరోక్షంగా వివాదం మరింత పెద్దది చేసే ఆలోచన లేదని చెప్పకనే చెప్పాడు.ఐతే రెండు రోజులుగా గరికపాటిపై వర్మ వరుస ట్వీట్స్ తో దాడి చేయడం విశేషం. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే మంచి వసూళ్లు రాబడుతుంది. కాగా చిరంజీవి మెగా 154 మూవీతో సంక్రాంతి బరిలో దిగనున్నారట.