spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Mega158 movie new look: #Mega158 లో ఊహకందని లుక్ లో కనిపించబోతున్న మెగాస్టార్...

Chiranjeevi Mega158 movie new look: #Mega158 లో ఊహకందని లుక్ లో కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి..

Chiranjeevi Mega158 movie new look: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ రీజనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో జనవరి నెలలో మొదలు అవ్వాల్సిన ఈ సినిమా , అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్ 10 న గ్రాండ్ గా లాంచ్ చేద్దామని అనుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కూడా లాంచ్ ఈవెంట్ కి ఆహ్వానించారు. కానీ ఈ చిత్రాన్ని నిర్మించబోయే KVN ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన మరో చిత్రం ‘జన నాయగన్ ‘ విడుదలకు ముందే లీక్ అవ్వడంతో , లాంచ్ ప్రోగ్రాం ని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా నేడు డైరెక్టర్ బాబీ మెగాస్టార్ చిరంజీవి కి లుక్ టెస్ట్ ని నిర్వహించాడు.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని లీక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ షెడ్యూల్ కోసం ఒక భారీ సెట్స్ ని ఏర్పాటు చేస్తున్నారట. ఈ సెట్స్ లో ఇంటర్వెల్ సన్నివేశాన్ని షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి , ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో వచ్చే ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలవబోతుందట. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ గా నిలవబోతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి లుక్ అభిమానులు కలలో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది అట. ఇందులో ఆయన 60 ఏళ్ళ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు.

బాబీ మార్క్ ఫ్యామిలీ డ్రామా తో పాటు , భారీ ఎలివేషన్ సన్నివేశాలు, ఊర మాస్ యాక్షన్ తో ఈ చిత్రాన్ని మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ లాగా మార్చబోతున్నాడట. అంతే కాకుండా , ఈ చిత్రం లో మెగాస్టార్ ఫస్ట్ హాఫ్ లో ఒక లుక్ , సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరో లుక్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందులో చిరంజీవి కి జోడీగా ప్రియమణి నటించబోతుండగా, మెగాస్టార్ కి కూతురుగా ‘ఛాంపియన్ ‘ మూవీ హీరోయిన్ అనశ్వర రాజన్ నటించబోతుంది. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. గతం లో బాబీ , చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని అంతకు మించిన బ్లాక్ బస్టర్ అయ్యేలా బాబీ తీర్చిదిద్దుతాడని అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version