spot_img
Homeఎంటర్టైన్మెంట్Aata grand finale: 'ఆట' గ్రాండ్ ఫినాలే లో హీరో రాజశేఖర్.. మెగా ఫ్యామిలీ శత్రువుని...

Aata grand finale: ‘ఆట’ గ్రాండ్ ఫినాలే లో హీరో రాజశేఖర్.. మెగా ఫ్యామిలీ శత్రువుని నిహారిక ఆహ్వానించడానికి కారణం ఏంటంటే..

Aata grand finale: మన టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కి భద్ర శత్రువులు ఎవరు అంటే మన అందరికీ గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు రాజశేఖర్. మొదట్లో రాజశేఖర్ , చిరంజీవి తో చాలా మంచి సాన్నిహిత్యం తోనే ఉండేవాడు. వీళ్లిద్దరు కలిసి ఆరోజుల్లో ‘ఆరాధన’ అనే చిత్రం చేశారు. అయితే ఒకానొక సమయం లో రాజశేఖర్ రేంజ్ బాగా పడిపోయింది , చిరంజీవి మెగాస్టార్ రేంజ్ కి వెళ్లిపోయేవాడు. ఒక ఇంటర్వ్యూ లో రాజశేఖర్ మాట్లాడుతూ ‘చిరంజీవి పెద్ద స్థాయికి వెళ్లాడని , మమ్మల్ని చిన్న చూపు చూడడం మొదలు పెట్టాడు, అప్పటి నుండి ఆయన పై మాకు మంచి అభిప్రాయం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా , చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు , ఒక మీడియా సమావేశం లో రాజశేఖర్ ని ఒక రిపోర్టర్ ప్రశ్న అడుగుతూ ‘ప్రజారాజ్యం పార్టీ లో మీరు కూడా చేరుతారా?’ అని అడుగుతారు.

అప్పుడు రాజశేఖర్ ‘ఆయనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు , నేను ఆయన పార్టీ లోకి ఎందుకు వెళ్తాను’ అని కామెంట్స్ చేస్తాడు. దీనికి మెగా ఫ్యాన్స్ మనసు నొచ్చుకోవడం తో రాజశేఖర్ కారులో వెళ్తుండగా , ఆయనపై దాడి చేస్తారు. అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ లో గొడవలు చెలరేగాయి. ఇప్పటికీ రాజశేఖర్ కి మెగాఫ్యామిలీ తో మంచి సంబంధాలు లేవు. అయినప్పటికీ కూడా నిహారిక కొణిదెల , తానూ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఆట’ అనే డ్యాన్స్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే కి రాజశేఖర్ , జీవిత జంటను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. వీళ్ళు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి పాల్గొనగా , అందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ ప్రోమో లో రాజశేఖర్ సీనియర్ హీరోయిన్ రాధికా తో ఫన్ చేయడం హైలైట్ గా నిల్చింది. ఆయన మాట్లాడుతూ ‘రాధికా గారు సెట్స్ లో నన్ను బాగా ర్యాగింగ్ చేసేవారు’ అని అంటాడు. ఏమని ర్యాగ్ చేసేవారు అని హోస్ట్ సుడిగాలి సుధీర్ అడగ్గా ‘నేను అద్దం లో చూసుకుంటున్నప్పుడు , చాలు చాలు బాగానే ఉన్నావ్, ఇక ఆపేయ్’ అనేవారు అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం రాజశేఖర్ , జీవిత లతో ‘ఆట ట్రోఫీ’ ని కూడా లాంచ్ చేయించడం గమనార్హం. మన భద్ర శత్రువుని ఎందుకు నీ షోకి ఆహ్వానించావు అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ నిహారిక పై మండిపడుతున్నారు. అయితే నిహారిక కి రాజశేఖర్ కూతుర్లతో మంచి సాన్నిహిత్యం ఉంది. అదే విధంగా రాజశేఖర్ , జీవితలతో కూడా ఆమెకు మంచి రిలేషన్ ఉంది, అందుకే ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
The Hunt for the Ultimate Winner | Aata Grand Finale Promo | Sat & Sun 9 PM | Zee Telugu

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version