Peddi Trailer Leaked By Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం పై అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ అభిమానులు గాయపడ్డ సింహాలు లాగా మారిపోయారు. కాస్త డీసెంట్ కంటెంట్ ని ఇచ్చినా సరే, వేరే లెవెల్ కి తీసుకెళ్తాము అనేంతలా ఉన్నారు, అలాంటి సమయం లో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కంటెంట్ ని వాళ్ళ ముందు పెట్టి ఊరిస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉంటారు చెప్పండి ?, ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ బ్లాక్ బస్టర్ ని సూచిస్తుంది, కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాం అనే నమ్మకాన్ని ఇచ్చింది. ఇక ఈ నెల 18 న విడుదల చేయబోయే ట్రైలర్ తో , ఆ నమ్మకం వెయ్యి రెట్లు పక్కా అని అంటున్నారు విశ్లేషకులు.
ఎందుకంటే కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ గురించి ఒక ట్వీట్ వేశాడు , అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి, అభిమానుల్లో ట్రైలర్ పై మరింత అంచనాలు కలిగించేలా చేస్తోంది. చిరంజీవి లో ఈ స్థాయి ఉత్సాహం ఒక కంటెంట్ ని చూసి కలిగిందంటే , కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టే. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం. చిరంజీవి మాట్లాడుతూ ‘పెద్ది థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే చూశాను. జస్ట్ వావ్ అనిపించింది. రామ్ చరణ్ , బుచ్చి బాబు , రెహమాన్ ఒక్కొక్కరు తమ వైపు నుండి పోటీ పడుతూ బెస్ట్ ఇచ్చారు. ముగ్గురు కలిసి రఫ్ఫాడించేసారు. ఎమోషన్స్ , ఎలివేషన్స్ , మ్యాడ్ నెస్ అన్నీ వేరే లెవెల్ లో ఉన్నాయి. అన్నట్టు చాలా రోజులైంది మీకు చిరు లీక్స్ ఇచ్చి’ అంటూ ఒక డైలాగ్ ని ట్రైలర్ నుండి లీక్ చేశాడు మెగాస్టార్.
‘మీరందరు నేను ఆడానని అనుకుంటున్నారను , కానీ నేను పోరాడాను సారూ.. ‘ క్షమించు బుచ్చి బాబు , ట్రైలర్ ని చూశాక, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక లీక్ చేసేశా అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్. ట్రైలర్ నిడివి 3 నిమిషాలకు పైగానే ఉంటుందట. నిజంగా చిరంజీవి చెప్పినట్టు థియేట్రికల్ ట్రైలర్ ఉంటే, రామ్ చరణ్ కి మరో రంగస్థలం లాంటి సినిమా పడబోతోంది అనుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్ కి రంగస్థలం స్థాయి సినిమా అంటే, వెయ్యి కోట్ల గ్రాస్ కచ్చితంగా కొల్లగొట్టగలదు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఎల్లుండి ముంబై లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
#PeddiTrailer చూసాను!!
Just… WOW3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!! ✨చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు!ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026
