ఎల్‌ఐసీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. డిగ్రీ అర్హతతో?

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి గతంలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ కాగా తాజాగా ఈ సంస్థ నుంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ రిలీజైంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు కేంద్ర ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా పని చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లను […]

Written By: Navya, Updated On : November 17, 2021 3:05 pm
Follow us on

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి గతంలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ కాగా తాజాగా ఈ సంస్థ నుంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ రిలీజైంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు కేంద్ర ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా పని చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లను నియమించడం జరుగుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు మార్కెటింగ్ అండ్ సేల్స్ కు సంబంధించిన విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలు పార్ట్ టైమ్ ఉద్యోగ ఖాళీలు కావడం గమనార్హం. డిసెంబర్ 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

https://www.ncs.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 7,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

https://www.ncs.gov.in/job-seeker వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.ncs.gov.in/job-seeker/pages/viewjobdetails.aspx?a=w1bcjxzb%2bw4%3d&u=&jsid=idbq5xf6snq%3d&rowid=idbq5xf6snq%3d&oj=7k4l7qq5iom%3d లింక్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.