Chiranjeevi Meeting: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు… ప్రతి ఒక్క హీరో సక్సెస్ ఫుల్ సినిమాలను చేయడానికి ప్రయత్నం చేస్తుండడం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే ఇక మీదట మన స్టార్ హీరోలు సైతం డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో మన తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే సినిమాలు తీయడంలో మనవాళ్లు ముందు వరుసలో ఉన్నారు… ఇక ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు వాళ్ళ సత్తా చాటుతున్నారు… సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు భారీగా రెమ్యూనరేషన్స్ ను తీసుకుంటూ సినిమాలను చేస్తూ సినిమా బడ్జెట్ ని పెంచుతున్నారు…దాంతో టికెట్ రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తద్వారా సగటు ప్రేక్షకులు థియేటర్ కి రావడం మానేశాడు. ఇక ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మాత్రం సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ను తగ్గించాలి. లేకపోతే మాత్రం చాలా థియేటర్లు మూత పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి… హీరోలు, ప్రొడ్యూసర్లు, దర్శకులు కలిసి ఒక మీటింగ్ మ టింగ్ నైతే పెట్టుకోవాలని చూస్తున్నారు…
హీరోల రెమ్యూనరేషన్ ని వాళ్ళ మార్కెట్ ను బట్టి రెమ్యూనరేషన్ ఎంత తీసుకోవాలి. ఏ సినిమాకు టికెట్ రేట్ ని ఎంత ఉంచాలి అనే విషయాల మీద సరైన క్లారిటీని తీసుకురావడానికే ఈ మీటింగ్ అరేంజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవి ఈ మీటింగ్ కి ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నాడు…
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా ఎవ్వరు లేకపోవడంతో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రూల్స్ అన్నింటిని మార్చేస్తున్నారు… ఇక ఇప్పుడు చిరంజీవి చేపడుతున్న ఈ మీటింగ్ కనక సాగినట్లయితే అఫీషియల్ గా చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా నిర్ణయించే అవకాశాలు కూడా ఉన్నాయి…
గతంలో ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉండాలని పలువురు కోరుకున్నప్పటికి కొంతమంది కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దాంతో చిరంజీవి ఇండస్ట్రీకి ఆపద ఉంటే నేను ఏదో ప్రయత్నం చేసి ఆదుకుంటాను కానీ ఇంట్రెస్ట్ పెద్దగా మాత్రం వ్యవహరించలేని ఆయన తప్పుకున్నాడు…ఇక ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ పెద్దగా మారితే ఇండస్ట్రీ లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి…