Chiranjeevi funny comment: ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రంతో మొదలుపెట్టిన బాక్స్ ఆఫీస్ విద్వంసం ఇంకా ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. గడిచిన రెండు రోజుల్లో బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ఈరోజు కూడా ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. మూడవ వారంలో థియేట్రికల్ రన్ ని బట్టి ఈ చిత్రానికి 300 కోట్ల గ్రాస్ వస్తుందో లేదో తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో అన్ని ప్రాంతాలకు చెందిన బయ్యర్స్ కి ప్రత్యేకమైన షీల్డ్స్ ని బహుకరించారు మేకర్స్.
అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘అనిల్ రావిపూడి తో నాతో మళ్లీ సినిమా చేస్తాడో లేదో తెలియదు. ఇప్పుడు రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాను కదా, ఈసారి హెలికాప్టర్ ని గిఫ్ట్ గా ఇస్తే సినిమా చేస్తాను అంటాడేమో. నాకు మళ్లీ అతనితో పని చెయ్యాలని ఉంది, అది కుదురుంటుందో లేదో తెలియదు కానీ, ఈ సినిమా చేస్తున్న సమయం లో నేను ఎంజాయ్ చేసిన రోజులని బాగా మిస్ అవుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. విక్టరీ వెంకటేష్ గురించి మాట్లాడుతూ ‘నాకు అత్యంత ఆప్త మిత్రుడు, నా సోదర సమానుడు, నా ఫ్యామిలీ ఫ్రెండ్ విక్టరీ వెంకటేష్ ఈ చిత్రం లో ఉండాలని నేను కోరుకున్నాను. అందుకు తగ్గట్టు అనిల్ రావిపూడి ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేయడం, మా ఇద్దరి మధ్య జరిగిన అల్లరి ఎప్పటికీ మర్చిపోలేను, చిన్న పిల్లలం అయిపోయాము’.
‘ఇద్దరు సూపర్ స్టార్స్ ని ఉన్న ఆ కాసేపు ఎంత అద్భుతంగా చూపించాలో అంత అద్భుతంగా చూపించాడు. అనిల్ రావిపూడి మన టాలీవుడ్ భవిష్యత్తు. మా ఇద్దరితో పూర్తి స్థాయి మల్టీస్టార్రర్ సినిమా చేసే సత్తా అతనికి ఉంది. మేము సిద్ధం గానే ఉన్నాము, ఇక అతను ఎప్పుడు కథ రెడీ చేస్తాడో చూడాలి’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. సుమారుగా 37 నిమిషాల పాటు ఆయన ప్రసంగించాడు. మెగాస్టార్ ని ఇంత సంతోషంగా మాట్లాడడం చూసి అభిమానులు చాలా కాలం అయ్యింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ ప్రసంగాన్ని మీరు కూడా చూసేయండి.
