Chiranjeevi helped Bollywood heroine mother
Chiranjeevi : తోటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరోలలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). సేవ కార్యక్రమాలు అంటే మన అందరికీ మెగాస్టార్ చిరంజీవి పేరే గుర్తుకొస్తుంది. సినిమాల్లో అయినా, సేవా కార్యక్రమాల్లో అయినా ఆయన కోట్లాది మంది అభిమానులను ప్రభావితం చేస్తుంటాడు. ముఖ్యంగా కరోనా సమయంలో చిరంజీవి చేసిన సహాయ కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఉచితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజెన్ సిలెండర్లు అందించడమే కాకుండా, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్తం కూడా సరఫరా చేసాడు. అదే విధంగా సినీ కార్మికులు పని లేక రెండు మూడు నెలలు ఆకలితో అలమటించే పరిస్థితులను పసిగట్టిన మెగాస్టార్, వాళ్ళ కోసం రెండు నెలలపాటు నిత్యావసర సరుకులు విషయం లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాళ్లకు ఉచితంగా సరుకులు అందించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు, అన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయన.
రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఊర్వశి రౌతేలా(urvasi rauthela) అమ్మగారికి కూడా చిరంజీవి సహాయం అందించాడట. ఈ విషయన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘మా అమ్మగారికి ఎడమ కాళ్లు ఎముక విరిగి చాలా కాలం నుండి బాధపడుతుంది. మేము ఆమె సమస్యకు సరైన పరిష్కారం చూపించలేకపోయాము. అనేక హాస్పిటల్స్ లో చికిత్స చేయించాము కానీ, ఎలాంటి లాభం లేదు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి గారు కోల్ కత్తా లోని అపోలో హాస్పిటల్స్ స్టాఫ్ తో మాట్లాడి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఆ తర్వాత మీ అమ్మగారికిఇ ఏమి అవ్వదు, ఆమె త్వరలోనే కోలుకుంటుంది అని ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. కీలక సమయంలో ఆయన చేసిన ఈ సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేను. ఆయన రుణం నేను ఏ జన్మలో తీర్చుకోలేని, సినిమాల్లో ఆయన కేవలం హీరో అయ్యుండొచ్చు, కానీ నిజ జీవితంలో దేవుడు’ అంటూ చెప్పుకొచ్చింది.
చిరంజీవి చేసిన ఈ సహాయం పట్ల సోషల్ మీడియా లో సర్వత్రా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇవి కేవలం మనకి తెలిసిన సహాయాలు మాత్రమే, తెలియకుండా ఎన్ని సహాయాలు చేసి ఉంటాడో లెక్కే లేదు. ఇకపోతే ఊర్వశి రౌతేలా మన తెలుగు ఆడియన్స్ కి ‘వాల్తేరు వీరయ్య(waltair veerayya)’ లోని ‘బాస్ పార్టీ’ అనే పాట ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఇప్పుడు ఈమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. మరోపక్క తమిళం, హిందీలో కూడా ఈమెకు మంచి డిమాండ్ ఉంది. రాబోయే రోజుల్లో ఈమె యూత్ ఆడియన్స్ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా ఈమెకు కీలక పాత్ర దొరికినట్టు సమాచారం.