Chiranjeevi : ఖరీదైన ప్రాంతాల్లో చిరంజీవికి మూడు ఫార్మ్ హౌస్లు, వాటి ధర ఎన్ని వందల కోట్లో తెలుసా?

టాలీవుడ్ రిచెస్ట్ హీరోల్లో చిరంజీవి ఒకరు. ఆయనకు స్థిర చర ఆస్తులు భారీగా ఉన్నాయి. ఇటీవల ఆయన మరొక ప్రాపర్టీ కొన్నారు. దాంతో కలిపి చిరంజీవికి మొత్తం మూడు ఫార్మ్ హౌస్లు ఉన్నట్లు అయ్యింది. కాగా ఈ మూడు ప్రాపర్టీస్ విలువ వందల కోట్లలో ఉంది.

Written By: S Reddy, Updated On : October 11, 2024 11:46 am

Megha Star Chiranjeevi

Follow us on

Chiranjeevi : చిరంజీవి సుదీర్ఘ సినిమా ప్రస్థానం కలిగి ఉన్నాడు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 156 సినిమాల్లో నటించారు. అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోల్లో చిరంజీవి ఒకరు. 1992లోనే ఆయన రెమ్యూనరేషన్ కోటి రూపాయలు దాటింది. ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ చిరంజీవి ముఖచిత్రంతో ఒక కథనం ప్రచురించింది.దాని ప్రకారం గ్యాంగ్ లీడర్ తర్వాత చిరంజీవి సినిమాకు రూ. 1.25 కోట్లు తీసుకున్నారట. అది అమితాబ్ బచ్చన్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఈ క్రమంలో చిరంజీవి భారీగా ఆర్జించారు. తాను సంపాదించిన మొత్తంలో కొంత సామాజిక సేవకు ఖర్చు చేస్తున్నారు. చిరంజీవికి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో అత్యంత విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇక లగ్జరీ కార్లకు లెక్కే లేదు. ఒక చార్టెడ్ ఫ్లైట్ కూడా ఉంది. కాగా ఇటీవల చిరంజీవి ఒక ప్రాపర్టీ కొనుగోలు చేశారు. దాంతో ఆయనకున్న ఖరీదైన ఫార్మ్ హౌస్ల వివరాలు బయటకు వచ్చాయి.

చిరంజీవికి మూడు ఫార్మ్ హౌస్లు ఉన్నాయి. వాటిలో ఒకటి బెంగళూరు శివార్లలో ఉంది. కెంపె గౌడ విమానాశ్రమానికి దగ్గరలో గల దేవనహళ్ళి ఏరియాలో చిరంజీవికి ఫార్మ్ హౌస్ ఉంది. ఇది కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉంది. రజినీకాంత్ కి కూడా అక్కడ ఫార్మ్ హౌస్ ఉంది. సంక్రాంతి వేడుకల కోసం మెగా ఫ్యామిలీ ఈ ఫార్మ్ హౌస్ కి వెళుతూ ఉంటారు. ఈ ఫార్మ్ హౌస్ విలువ రూ. 40 కోట్లు అని అంచనా.

చిరంజీవి చాలా ఏళ్ల క్రితమే కోకాపేటలో కొన్ని ఎకరాలు కొన్నారు. అక్కడ ఫార్మ్ హౌస్ నిర్మించారు. హైదరాబాద్ విస్తరించడంతో కోకాపేట భూముల ధరలు భారీగా పెరిగాయి. ఈ కోకాపేట ఫార్మ్ హౌస్ మార్కెట్ విలువ రూ. 200 కోట్లు ఉంటుందని సమాచారం. సైరా నరసింహారెడ్డి సినిమా కోసం కోకాపేట ఫార్మ్ హౌస్లో భారీ సెట్స్ నిర్మించారు. అవి కాస్తా.. అగ్నికి ఆహుతి అయ్యాయి. అప్పుడు చిరంజీవి కోకాపేట ఫార్మ్ హౌస్ వార్తలకు ఎక్కింది.

ఇటీవల చిరంజీవి ఊటీలో ఒక ప్రాపర్టీ కొన్నారు. అక్కడ లగ్జరీ ఫార్మ్ హౌస్ నిర్మించాలి అనేది ఆయన కోరికట. ఈ ప్రాపర్టీని చిరంజీవి రూ. 16 కోట్లు వెచ్చించి కొన్నారట. సినిమా స్టార్లు, వ్యాపారవేత్తలు, ధనికులు ఊటీలో ప్రాపర్టీ కొని హౌస్ నిర్మించుకుంటారు. చిరంజీవి తాజాగా ఆ ఆలోచన చేశారట. మరోవైపు చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.