IAS Officers: ఆయన వల్లే.. ఆ ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కేడర్ ప్రమాదంలో పడిందా? అందువల్లే ఏపీకి వెళ్లాల్సి వస్తోందా? ఇందులో నిజం ఎంత..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల విభజనకు కేంద్రం ప్రత్యూష్ సిన్హా కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ స్థానికతను పరిశీ.. విభజనకు పలు మార్గదర్శకాలను సూచించింది. అధికారుల వద్ద ఆప్షన్లు కూడా స్వీకరించింది..

Written By: Anabothula Bhaskar, Updated On : October 11, 2024 11:23 am

IAS Officers(1)

Follow us on

IAS Officers: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలి, అటవీ శాఖ సెక్రెటరీగా పనిచేస్తున్న వాణి ప్రసాద్, మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వాగాటి కరుణ, రోనాల్డ్ రాస్.. ఐపీఎస్ అధికారులు అభిలాష బిస్త్, అభిషేక్ బిస్తి వంటి అధికారులు.. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్లాల్సిందే. కేడర్ మార్పు కోసం వారు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. అయితే దీని వెనుక ఐఏఎస్ అధికార వర్గాల్లో విస్తృతమైన చర్చ నడుస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల విభజనకు కేంద్రం ప్రత్యూష్ సిన్హా కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ స్థానికతను పరిశీ.. విభజనకు పలు మార్గదర్శకాలను సూచించింది. అధికారుల వద్ద ఆప్షన్లు కూడా స్వీకరించింది.. అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలకు అఖిలభారత సర్వీస్ అధికారులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఒకే సంవత్సరానికి చెందిన అధికారులకు స్వాపింగ్ ప్రక్రియ ద్వారా కేడర్ మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే దీనిని ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన సందీప్ కుమార్ సుల్తానియా.. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నటరాజన్ గుల్జార్ స్వాపింగ్ ను సద్వినియోగం చేసుకున్నారు.. గుల్జార్ ఏపీ రాష్ట్రానికి వెళ్లారు. సుల్తానీయా తెలంగాణలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేస్తున్న ముఖేష్ కుమార్ మీనా తెలంగాణకు వచ్చేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. గత ప్రభుత్వం ఆయన చేసుకున్న దరఖాస్తును పరిశీలించలేదు. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లారు. ఇక గత ప్రభుత్వ పెద్దలు ఆశీస్సులు అందజేయడంతో ఆమ్రపాలి, ఇతర అధికారులు 2015లో క్యాట్ ను ఆశ్రయించారు. వారి వాదనలను క్యాట్ విన్నది. ఆ తర్వాత వారిని తెలంగాణలోనే కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

కేంద్రం హైకోర్టులో సవాల్ చేసింది

ఈ తీర్పును కేంద్రం సవాల్ చేసింది. 2017లో తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తెలంగాణ హైకోర్టు జనవరి మూడవ తేదీన తీర్పు వెల్లడించింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఇదే సమయంలో ఆ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల దరఖాస్తులను మరొకసారి పరిశీలించాలని సూచించింది. గత పది సంవత్సరాలుగా ఐదుగురు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు తెలంగాణలో పనిచేస్తున్నారు. అయితే డీవోపీటీ రికార్డులలో మాత్రం వారు ఏపీ కేడర్ లో పనిచేస్తున్నట్టు ఉంది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవహారం వల్లే ఆ అధికారుల కేడర్ ఇబ్బందుల్లో పడినట్లు సమాచారం. కేంద్రం స్పష్టంగా ఉండడం.. కోర్టు తీర్పు తర్వాత సోమేశ్ కుమార్ ను ఆంధ్ర ప్రదేశ్ కు నాటి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అది ఇష్టం లేక ఆయన స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినప్పటికీ సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో పనిచేశారు. ఒకానొక దశలో నాటి ప్రభుత్వ పెద్దల అండ దండలుండడంతో ఐఏఎస్ అధికారుల సంఘాన్ని నిర్వీర్యం చేశారని.. అనవసరంగా వేలు పెట్టారని ప్రచారం జరిగింది. ఫలితంగా ఐఏఎస్ అధికారులు సోమేశ్ కుమార్ పై వ్యతిరేకత పెంచుకున్నారని సమాచారం. అంతేకాదు ఆయన సీఎస్ గా ఉన్నప్పుడు ఐఏఎస్ ల పై అనుచితంగా వ్యవహరించే వారనే విమర్శలు కూడా వినిపించాయి. అయితే దీనిని సోమేష్ కుమార్ ఖండించారు. తాను ప్రతి అధికారితోనూ మర్యాదగానే ప్రవర్తించానని.. సోమేశ్ కుమార్ వివరించారు.