Pawan Kalyan Chiranjeevi : టాలీవుడ్ లో చిరంజీవి – పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో మన అందరికీ తెలుసు. క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి పదాలకు పర్యాయపదాలు వంటి వారు అన్నదమ్ములిద్దరూ కూడా..వీళ్లిద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం..ఒక్క రోజు గ్యాప్ తో విడుదలవ్వడం లేదా వారం రోజుల గ్యాప్ తో విడుదలవ్వడం వంటివి ఇన్నేళ్ళలో ఎప్పుడూ కూడా జరగలేదు..మొదటిసారి అలాంటి సందర్భం ఈ నెలలోనే రాబోయింది.

అదేంటి ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి, ‘హరిహర వీరమల్లు’ చిత్రం సమ్మర్ లో కదా. .ఈ నెలలో వీళ్లిద్దరి సినిమాలు పోటీ పడడం ఏమిటి అని అనుకుంటున్నారా!, అవి కొత్త సినిమాలు కాదులెండి.. వీళ్లిద్దరి కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు..మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాని ఈ నెల 31 వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి.
అయితే యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ రీ రిలీజ్ కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఈ క్రమం లో తమ్ముడి సినిమాకి పోటీగా అన్నయ్య సినిమా ఎందుకని సీనియర్ మెగా ఫ్యాన్స్ గ్యాంగ్ లీడర్ ని పక్కకి జరిపారు..దీనిపై సోషల్ మీడియా లో ఉండే మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
వింటేజ్ మెగాస్టార్ ని వెండితెర మీద చూద్దాం అంటే ఇలా చేశారేంటి అంటూ మెగా ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు..అయితే ఈ సినిమాని ఇప్పుడు కాకుండా మంచి సీజన్ చూసుకొని కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేద్దామని..అంత వరకు ఓపిక పట్టండి అని..ఈసారి మెగా ఫ్యాన్స్ అందరూ ఖుషి సినిమాని ప్రోత్సహించండి అంటూ సీనియర్ మెగా ఫ్యాన్స్ సర్దిచెప్తున్నారు.