https://oktelugu.com/

Chiranjeevi Vishwambhara: లీక్ ఇవ్వకూడదు అనుకుంటూనే చిరంజీవి విశ్వంభర సినిమా నుంచి భారీ లీక్ ఇచ్చేశాడుగా..

రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే విశ్వంభర సినిమాకి సంబంధించిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రీసెంట్ గా చిత్రీకరించారట.

Written By:
  • Gopi
  • , Updated On : April 24, 2024 / 12:40 PM IST

    Chiranjeevi has Leaked Once Again about Vishwambhara movie

    Follow us on

    Chiranjeevi Vishwambhara: తెలుగు సినిమా ఇండస్ట్రీని దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఏకఛత్రదిపత్యం లో ఏలీన ఒకే ఒక్కడు మెగాస్టార్ చిరంజీవి…ఈయన గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంక ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అలాంటి గొప్ప స్టార్ డమ్ ను సంపాదించుకున్న చిరంజీవి ప్రస్తుతం ‘బింబిసారా ‘ మూవీ తో మంచి సక్సెస్ ని అందుకున్న వశిష్ట డైరెక్షన్ లో ‘విశ్వంభర ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తను సక్సెస్ ని సాధించాలి అనే ఒక ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే విశ్వంభర సినిమాకి సంబంధించిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రీసెంట్ గా చిత్రీకరించారట. ఇక 26 రోజులపాటు సాగిన ఈ షెడ్యూల్లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లతో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేసి దాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీని కోసం 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని కూడా తయారు చేయించినట్టుగా తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఏదైనా ఈవెంట్ కు వచ్చిన ప్రతిసారి తన తర్వాత సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని లీక్ చేస్తూ ఉంటాడు.

    ఇక ఇప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశ్వంభర సినిమా సెట్ లోకి వచ్చి కలిసినప్పుడు చిరంజీవి లుక్కు కు సంబంధించి ఒక లీక్ అయితే వైరల్ అయింది. ఇక రీసెంట్ గా కార్తికేయ హీరోగా వస్తున్న ‘భజే వాయువేగం’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చిరంజీవిని చూసిన చాలా మంది ఆ లుక్ లో ఆయన వింటేజ్ చిరంజీవిని తలపిస్తూ కనిపించడం అభిమానులకి పెద్ద పండుగగా మారింది. ఇక ఆ ఈవెంట్ లో విశ్వంభర సినిమా గురించి అడగగా చిరంజీవి దాని గురించి ఏమీ మాట్లాడలేదు.

    అయినప్పటికీ తను మాట్లాడకపోయినా కూడా చిరంజీవి ఒకప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన ‘రౌడీ అల్లుడు’ సినిమాలో ఎలా ఉండేవాడో ఈ సినిమాలో కూడా అలా కనిపిస్తూనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చిరంజీవి నటిస్తున్నాడనే లీక్ అయితే చిరంజీవి లుక్ ను బట్టి బయటికి వచ్చినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇక లీక్ ఇవ్వదనుకున్న చిరంజీవి లుక్ తోనే ఒక పెద్ద లీక్ అయితే బయటకు వచ్చింది అని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…