Chiranjeevi Grandson: చిరంజీవి హీరోగా వచ్చిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ సైతం ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా వరకు కృషి చేస్తున్నాడు… ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాలతో కూడా జాగ్రత్తలు తీసుకొని గొప్ప సినిమాలు చేసి మంచి ఇమేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయనకి కవల పిల్లలు జన్మించారు. అందులో ఒకరు అబ్బాయ్ కాగా, మరొకరు అమ్మాయి కావడం విశేషం…ఇక ఎట్టకేలకు మెగా ఫ్యామిలీ లో వారసుడు వచ్చాడంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కొడుకుకి ఒక దోషమైతే ఉందని అది క్లియర్ చేయడానికి కొన్ని యజ్ఞ యాగాలు చేయాలని పురోహితులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక దానికోసం చిరంజీవి – రామ్ చరణ్ సైతం ఆ కార్యక్రమాలను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని గతంలో చిరంజీవి చెప్పాడు.
ఇక చిరంజీవి ఫ్యామిలీ నుంచి రాబోయే సినిమాల కోసం అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది… ఇక ఇప్పుడు పెద్ద సినిమాలతో రామ్ చరణ్ సైతం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అలాగే సమ్మర్లో చిరంజీవి విశ్వంభర సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని సైతం సమ్మర్ కానుక గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఇయర్ మొత్తం మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం…