Godfather First Review: మరో రెండు వారాల్లో చిరంజీవి గాడ్ ఫాదర్ గా థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. అయితే సినిమా టాక్ ముందే వచ్చేసింది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్ మూవీ యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. అలాగే సెన్సార్ సభ్యులు సినిమా ఎలా ఉందో చెప్పుకొచ్చారు. సెన్సార్ మెంబర్స్ అభిప్రాయం ప్రకారం గాడ్ ఫాదర్ చాలా బాగుంది. వారు సినిమా పట్ల పాజిటివ్ గా స్పందించారు. మాస్ పొలిటీషియన్ లుక్ లో చిరంజీవి వెండితెరపై అద్భుతం చేశారంటున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ బాగా సెట్ అయ్యిందని, దర్శకుడు ఆయన క్యారెక్టర్ ని బాగా ఎలివేట్ చేశారంటున్నారు. ఇక యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కి ట్రీట్ గా అభిప్రాయపడ్డారు.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ క్యామియో, నయనతార చేసిన పవర్ ఫుల్ రోల్ సినిమాకు ప్లస్ అయ్యాయని సభ్యులు చెప్పుకొచ్చారు. మొత్తంగా గాడ్ ఫాదర్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ అంటున్నారు. ఆచార్యతో దారుణమైన పరాజయం చవిచూసిన చిరంజీవి గాడ్ ఫాదర్ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తున్నారంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. గాడ్ ఫాదర్ మూవీపై సెన్సార్ సభ్యుల రివ్యూ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. మరి సెన్సార్ సభ్యుల స్పందన ఇలా ఉండగా.. ఏ మేరకు థియేటర్స్ లో చిరంజీవి మెప్పిస్తారో విడుదలైతే కానీ తెలియదు.
విడుదల దగ్గరపడుతున్నా సినిమాపై చెప్పుకోదగ్గ బజ్ లేదు. గాడ్ ఫాదర్ చిత్రం గురించి ఇండస్ట్రీలో సందడి లేదు. మరోవైపు గాడ్ ఫాదర్ పై అనేక నెగిటివ్ రూమర్స్ ప్రచారం అవుతున్నాయి. గాడ్ ఫాదర్ అవుట్ ఫుట్ చేసిన సల్మాన్ సంతృప్తి వ్యక్తం చేశారని, హిందీలో విడుదల వద్దంటున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. అలాగే గాడ్ ఫాదర్ చిత్రానికి బయ్యర్లు దొరకడం లేదట. కొనడానికి ఆసక్తి చూపినా చాలా తక్కువ ధరకు అడుగుతున్నారట. యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కేవలం రూ. 3 కోట్లు ఇస్తామని చెప్పడంతో మేకర్స్ నిరుత్సాహపడ్డారట.

ఇలా భారీ ఎత్తున మూవీపై దుష్ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ చిత్రానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నమ్మడం కష్టమే. ఇక మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కింది. మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. సాహో ఫేమ్ సుజీత్ ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాల్సి ఉండగా చిరంజీవి ఆయన్ని తప్పించి ఆ బాధ్యత మోహన్ రాజాకు అప్పగించారు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్ర చిరంజీవి చేస్తున్నారు. నయనతార చిరంజీవి చెల్లిగా నటించనున్నట్లు సమాచారం. అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది.