Chiranjeevi And Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది…గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర్ వర ప్రసాద్’ సినిమా 350 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టి ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో చిరంజీవికి భారీ సక్సెస్ ని అందించిన దర్శకుడు ఎవరు లేరు కాబట్టి అనిల్ రావిపూడి అంత పెద్ద సక్సెస్ ని కట్టబెట్టినందుకు గాను అతనికి రేంజ్ రోవర్ కార్ ను చిరంజీవి గిఫ్ట్ గా ఇచ్చాడు… ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది… చిరంజీవి తనకు ఎవరైనా సక్సెస్ ఇచ్చిన లేదంటే, తనకు ఎవరైనా నచ్చిన కూడా వాళ్లకు అరుదైన బహుమతులను ఇస్తుంటాడు. తన నుంచి గిఫ్ట్ లు అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఆ లిస్టులో అనూ రావిపూడి కూడా చేరిపోవడం విశేషం…
ఇక అనిల్ రావిపూడి సినిమాలు సంక్రాంతికి వచ్చి సూపర్ సక్సెస్ ని సాధిస్తాయనే విషయం మనందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్టామినా వాడుకొని తనలోని కామెడీ యాంగిల్ ను సైతం బయటికి తీసి సూపర్ సక్సెస్ ని అందించాడు.
ఈ సినిమాతో మెగా అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో పెద్దగా ఎలివేషన్స్ ఏమీ లేకుండా జస్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి ఫ్యామిలీ ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు… ఇక ప్రస్తుతం చిరంజీవి ఇచ్చిన రేంజ్ రోవర్ రేట్ ఎంత అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక చిరంజీవి గిఫ్టుగా ఇచ్చిన రేంజ్ రోవర్ ఖరీదు 3 కోట్ల వరకు ఉంటుంది అంటూ కొంతమంది ప్రేక్షకులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా అంత ఖరీదైన గిఫ్ట్ చిరంజీవి దగ్గర నుంచి పొందాడు అంటే అనిల్ రావిపూడి మామూలోడు కాదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…