Chiranjeevi: చిరుత సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… చిరంజీవి కొడుకు అయినప్పటికి అతనికి సినిమాల పట్ల ఉన్న ఇంట్రెస్ట్ తో మొదటి సినిమాతోనే తనలోని నటుడుని బయటికి తీశాడు. తను ఏదైతే యాక్టింగ్ ని ప్రజెంట్ చేశాడో అది ప్రేక్షకులందరికీ నచ్చింది. ఇక రెండో సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం తన వైపు తిప్పుకునేలా చేశాడు… ఇక అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం తన సినిమా కెరియర్ ను చాలా బాగా డిజైన్ చేసుకుంటున్నాడు. గత సంవత్సరం వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నప్పటికి ఈ సంవత్సరం రాబోతున్న ‘పెద్ది’ సినిమా విషయంలో అతను చాలా క్లారిటిగా ఉన్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ అయిన తన కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ లాంటి నటుడు చేస్తున్న ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక రామ్ చరణ్ పర్సనల్ విషయానికి వస్తే తనకి రీసెంట్ గా కవల పిల్లలు పుట్టారు. అందులో ఒకరు అబ్బాయి కాగా, మరొకరు అమ్మాయి కావడం విశేషం.. ఇక మెగాస్టార్ చిరంజీవి కూతుర్లకు అందరు కూతుర్లే పుట్టడంతో గతంలో చిరంజీవి మాట్లాడుతూ ఇంటికి వెళ్తే చాలు ఒక లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కనీసం ఒక అబ్బాయి కూడా లేడు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
కానీ ఎట్టకేలకు మెగా ఫ్యామిలీలో ఒక వారసుడు రావడం పట్ల అటు మెగా ఫ్యామిలీ అలాగే ఇటు మెగా అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు… మనవడు పుట్టిన నేపథ్యంలో చిరంజీవి తన మనవడికి ఒక భారీ గిఫ్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది… చిరంజీవి వాళ్ళ అమ్మ అయిన అంజనా దేవి చిన్నప్పుడు ఇచ్చిన ఒక ఆంజనేయుడి దండని చిరంజీవి ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలేదట. కానీ రామ్ చరణ్ కొడుకుకి అంటే చిరంజీవి యొక్క మనవడికి తానే స్వయంగా ఆ దండ ను వేశారట.
ఇప్పటివరకు తను ఎప్పుడు ఎవరికీ ఆ దండను ఇవ్వలేదని ఎందుకో ఫస్ట్ టైం తన మనవడికి ఇవ్వాలనిపించిందని చిరంజీవి తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఆంజనేయుడు అంటే చిరంజీవికి చాలా ఇష్టం…అలాంటి ఆంజనేయుడు దండని తన మనవడికి ఇచ్చాడు అంటే తను కూడా రేపు ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ అంతటి రేంజ్ లో రాణించాలని ప్రతి ఒక్క మెగా అభిమానులు కోరుకుంటున్నారు…