https://oktelugu.com/

Bhola Shankar Movie: తమన్నాది లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..?

ఈ సమయంలో తమన్నా గురించి ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. చిరు, తమన్నా కలిసి ఓ సాంగ్ లో నటించబోతున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం మూవీ యూనిట్ స్విట్జర్లాండ్ వెళ్లింది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 25, 2023 / 01:07 PM IST

    Bhola Shankar Movie

    Follow us on

    Bhola Shankar Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే మాములు క్రేజ్ కాదు. ఆయన సినిమా అంటే థియేటర్ల వద్ద పండుగ వాతావరణమే. రీసెంట్ గా ఆయన నటించిన మాస్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సక్సెతో జోష్ ఉన్న ఈయన ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం చిరు ‘భోళా శంకర్’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇందులో చిరంజవీతో పాటు తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చిరు, తమన్నాలు కలిసి ఇప్పటికే ‘సైరా నరసింహారెడ్డి’ సినిమలో కనిపించారు. అయితే ఇందులో తమన్న రెండో హీరోయిన్ గా నటించింది. కానీ ఇప్పుడు ‘భోళా శంకర్’లో మిల్క్ బ్యూటీ చిరంజీవి పక్కన స్టెప్పులు వేయనుంది.

    ఈ సమయంలో తమన్నా గురించి ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. చిరు, తమన్నా కలిసి ఓ సాంగ్ లో నటించబోతున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం మూవీ యూనిట్ స్విట్జర్లాండ్ వెళ్లింది. పచ్చని వాతావరణంలో ఓ పాట షూటింగ్ లో చిరుతో పాటు తమన్నా కూడా నటిస్తారు. ఈ సందర్భంగా లోకేషన్ కు సంబంధించిన ఓ పిక్ నెట్టింట్లోకి వచ్చింది. ఈ పిక్ స్విట్జర్లాండ్ లోనిదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

    ఈ సందర్భంగా చిరంజీవి పేరిట ‘చిరు లీక్స్’ అనే యాష్ ట్యాగ్ పెట్టి ఈపిక్ ను రిలీజ్ చేశారు. అయితే దీనిని బయటపెట్టింది చిరునే అనుకునేలా కొందరు ఇలా పెట్టి ఉంటారని అంటున్నారు. మెగాస్టార్ సినమాలంటే క్రేజ్ ఉండనిదెవరికీ. అందుకే ఆయన రాబోతున్న చిత్రం పిక్స్ ముందే రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ లో ఊపు పెరుగుతుందని కొందరు అనుకుంటారు. ఇలాంటి తరుణంలో ఈ పిక్ బయటపడడంతో దీనిని ఎవరు లీక్ చేశారు? అనే చర్చ సాగుతోంది. ఇక తమన్నాతో చిరు స్టెప్పులు వేయడం ఇదే మొదటిసారి. అందుకే తమన్నా సీన్ ను చిరు బయటపెట్టారనే అర్థం వచ్చే లా ట్యాగ్ పెట్టారు.

    చెల్లెలి సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న ‘భోళా శంకర్’ మూవీలో చిరు, తమన్నాలతో పాటు కీర్తి సురేశ్ కూడా నటిస్తున్నారు. ఇందులో ఆమె చిరుకు చెల్లెలుగా కనిపిస్తారు. చిరుకు చెల్లలుగా నటించడానికి అంతకుముందు ఓ హీరోయిన్ ను సంప్రదించగా ఒప్పుకోలేదు. కానీ కీర్తి సురేశ్ మాత్రం చిరుతో నటించే ఛాన్స్ న వదులుకోలేదు. మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ లుక్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. తాజా పిక్ తో మరింత అంచనాలు పెరిగాయని అంటున్నారు.