Chiranjeevi : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే సీనియర్ హీరోలు సైతం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరూ కలిసి భారీ విజయాలను సాధిస్తారా? తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారు లేదా అనేది తెలియాల్సి ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు చిరంజీవి(Chiranjeevi)… గత 50 సంవత్సరాలు నుంచి మెగాస్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఆయన సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పటికే వశిష్ట డైరెక్షన్ లో చేసిన ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్ లో ఇప్పుడు చేయబోతున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మరొక స్టార్ హీరో కూడా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. చిరంజీవి చేసిన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ సినిమాలో శ్రీకాంత్ తన ఫ్రెండ్ గా సోదరుడిగా నటించి మెప్పించాడు. మరి ఇలాంటి సందర్భంలోనే వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంటుంది. ఇక మరోసారి ఆ బాండింగ్ ని చూపిస్తూ ఫుల్ లెంత్ కామెడీ చేయించే ప్రయత్నంలో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?
మరి తను అనుకున్నది కనుక క్లారిటీగా వర్క్ అవుట్ అయితే మాత్రం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందంటూ చాలామంది మెగాస్టార్ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి చేసే ప్రతి సినిమాలో కూడా కామెడీ అనేది స్టోరీ భాగంగా రన్ అవుతూ ఉంటుంది. అందుకోసమే ఆయనకు కామెడీలో మంచి పట్టు ఉన్న దర్శకుడిగా పిలుస్తూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాతో కూడా మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అవకాశం కొందరికి మాత్రమే వస్తుంది. మరి అనిల్ రావిపూడి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!