Chiranjeevi Drill Master Role: నిన్నగాక మొన్ననే మొదలైనట్టు అనిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) చిత్రం అప్పుడే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని, రెండవ షెడ్యూల్ ని కూడా వాయు వేగంతో పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం ముస్సోలిలో లో షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు హీరోయిన్ నయనతార(Nayanthara) పాల్గొంటుంది. నేడే ఆమె సెట్స్ లోకి అడుగుపెట్టారు. స్కూల్ నేపథ్యం లో ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి పేరు శివ శంకర వరప్రసాద్. ఇందులో ఆయన డ్రిల్ మాస్టర్ గా నటించబోతున్నాడు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం లో కీలక పాత్ర పోషించిన కేథరిన్ థెరిసా(Catherine Tresa) కూడా ఈ చిత్రం లో మరో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నా రెండవ షెడ్యూల్ లో ఆమె కూడా పాల్గొంటుంది.
ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం లో బుల్లిరాజు క్యారక్టర్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బుడ్డోడు రేవంత్ ఈ చిత్రం లో కూడా నటిస్తున్నాడు. ఇందులో కూడా అనిల్ రావిపూడి ఆ బుడ్డోడి కోసం ఒక ప్రత్యేకమైన క్యారక్టర్ రాసుకున్నట్టు తెలుస్తుంది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఆ బుడ్డోడు చిరంజీవి తోనే ఉంటాడట. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో విక్టరీ వెంకటేష్ కూడా ఉంటాడని అంటున్నారు. ఆయనకు ఒక ప్రత్యేకమైన పాట, ఫైట్ సన్నివేశాలు కూడా ఉంటాయట. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని కోరుకుంటూ ఉండే సినీ అభిమానులకు ఈ చిత్రం ద్వారా ఆ కోరిక నెరవేరబోతోంది. అయితే వెంకటేష్ క్యారక్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం లోని పాత్రకు కొనసాగింపుగా ఉంటుందా?, లేకపోతే ప్రత్యేకమైన పాత్ర ఆయన కోసం రెడీ చేశారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Chiranjeevi : చిరంజీవి ఎందుకని ఆ జానర్ లో సినిమా చేయలేకపోయాడు..?
ఈ ఏడాది అక్టోబర్ లోపు ఈ చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇతను తన ప్రతీ సినిమాకు ప్రొమోషన్స్ విషయం లో ఎంతటి స్పెషల్ కేర్ తీసుకుంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు కూడా అలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ప్రొమోషన్స్ పేరు కూడా తెలియని నయనతార నే ఒప్పించాడంటే అనిల్ రావిపూడి అసాధ్యుడే అనుకోవాలి. అక్టోబర్, నవంబర్ నెలల్లో పూర్తి స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసి, సంక్రాంతికి ఈ సినిమాని రెడీ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. అనిల్ రావిపూడి స్పీడ్ చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారమే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమాతో 400 కోట్ల రూపాయిల గ్రాస్ పై కన్నేసినట్టు తెలుస్తుంది.
డ్రిల్ మాస్టర్ శివ శంకర్ వర ప్రసాద్ గా.. Chiranjeevi.
ప్రస్తుతం ముస్సోలిలో షూటింగ్ జరుగుతోంది.
స్కూల్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
సెట్లో చిరంజీవితో పాటుగా Nayanthara, Catherine
— Telugu360 (@Telugu360) June 18, 2025