Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Directors Failure: చిరంజీవి విషయంలో ఆ ఇద్దరు దర్శకులు క్లారిటీ మిస్ అవ్వడానికి కారణం...

Chiranjeevi Directors Failure: చిరంజీవి విషయంలో ఆ ఇద్దరు దర్శకులు క్లారిటీ మిస్ అవ్వడానికి కారణం…

Chiranjeevi Directors Failure: మెగాస్టార్ చిరంజీవి హీరోగా గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అది చాలా మంది దర్శకులు అతనికి గొప్ప విజయాలను అందించారు. కానీ ఒక ఇద్దరు దర్శకులు మాత్రం చిరంజీవిని సరిగ్గా అంచనా వేయలేకపోయారని చాలామంది కామెంట్లు చేస్తుంటారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే […]

Chiranjeevi Directors Failure: మెగాస్టార్ చిరంజీవి హీరోగా గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అది చాలా మంది దర్శకులు అతనికి గొప్ప విజయాలను అందించారు. కానీ ఒక ఇద్దరు దర్శకులు మాత్రం చిరంజీవిని సరిగ్గా అంచనా వేయలేకపోయారని చాలామంది కామెంట్లు చేస్తుంటారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే ఒకరు గుణశేఖర్ కాగా, మరొకరు సురేష్ కృష్ణ కావడం విశేషం… వీళ్లిద్దరు చిరంజీవికి చేరో సక్సెస్ ని అందించినప్పటికి రెండో సినిమా విషయంలో మాత్రం ఇద్దరు తడబడ్డారు. ముందుగా గుణశేఖర్ చిరంజీవితో ‘చూడాలని ఉంది’ అనే సినిమా చేశాడు.

ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది ఆ తర్వాత మృగరాజు సినిమా చేయడం వల్ల ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. దాంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ మీద భారీ విమర్శలైతే వచ్చాయి. ఇక సురేష్ కృష్ణ సైతం మొదట చిరంజీవితో ‘మాస్టర్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది.

ఆ తర్వాత డాడీ అనే ఒక సెంటిమెంటల్ సినిమాని చిరంజీవితో చేయడం వల్ల ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. మొత్తానికైతే చిరంజీవి తను చేసిన సినిమాలన్నింటితో సక్సెస్ ని సాధించినప్పటికి ఈ రెండు సినిమాల వల్ల చాలా వరకు తన ఇమేజ్ డ్యామేజ్ అయిందనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి స్టార్ హీరోకు మొదట సక్సెస్ ని అందించిన వాళ్లు మరోసారి తన క్రేజ్ ను గాని, తన స్టామినా ను అంచనా వేయడంలో తడబడ్డారనే చెప్పాలి… ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు చిరంజీవి చాలా తక్కువ సినిమాలతో తెచ్చుకున్నాడు. కానీ తనను చాలా మంది దర్శకులు డిఫరెంట్ విధానంలో ప్రజెంట్ చేశారు. కొంతమంది మాత్రం తనను సరైన విధంగా అంచనా వేయలేక డిజాస్టర్లను అందించారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper