Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన సినిమాల్లో హీరోయిన్స్ గా కాజల్(Kajal Agarwal), తమన్నా(Tamanna bhatia) నటించారు. ‘ఖైదీ నెంబర్ 150’ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, ‘సైరా నరసింహా రెడ్డి’, ‘భోళా శంకర్’ చిత్రాల్లో తమన్నా హీరోయిన్ గా నటించింది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి నాకు కాజల్ అగర్వాల్, తమన్నా అంటే ఎవరో తెలియదు అంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన చెప్పిన సందర్భం ఏమిటంటే సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను సినీ ఇండస్ట్రీ కి పూర్తిగా దిస్ కనెక్ట్ అయిపోయానని, కాజల్ అగర్వాల్, తమన్నా ఎవరో కూడా తెలిసేది కాదని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ‘ఖైదీ నెంబర్ 150’ లో హీరోయిన్ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని తీసుకున్నాం సార్ అని వినాయక్ చెప్పినప్పుడు కాజల్ ఎవరు అని అడిగానని చిరంజీవి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.
కాజల్ అగర్వాల్ అంతకు ముందు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో మగధీర, నాయక్, గోవిందుడు అందరి వాడేలే, ఎవడు వంటి చిత్రాల్లో నటించింది. అదే విధంగా తమన్నా రామ్ చరణ్ తో కలిస్ ‘రచ్చ’ చిత్రంలో నటించింది. ఈ సినిమాలన్నీ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు, సినీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వనప్పుడు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ఆయన పాల్గొన్నాడు కూడా. ఆ ఈవెంట్స్ లో హీరోయిన్స్ గా నటించిన కాజల్ అగర్వాల్, తమన్నా గురించి కూడా ఆయన తన ప్రసంగం లో మాట్లాడాడు. అలాంటి చిరంజీవి, ఇప్పుడు రీ ఎంట్రీ కి ముందు ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో తెలియదు అనడం నిజంగానే విడ్డూరంగా ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో అలా మాట్లాడాడో తెలియదు కానీ, ఆయన తమన్నా , కాజల్ ఎవరో తెలియదు అనడం మాత్రం అతిశయోక్తిగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వాచినట్టు చెప్తున్నారు నిర్మాతలు. ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ చిత్రం తో పాటు విడుదలైన మిగిలిన సంక్రాంతి సినిమాల థియేట్రికల్ రన్స్ కూడా ఆగిపోయాయి.