Chiranjeevi : నా ఇంట్లోనే నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చింది అంటూ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!

చిరంజీవి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ' సూన్యం నుండి శిఖరాగ్రాలకు అనే టైటిల్ ని ఈ పుస్తకానికి పెట్టడం ఎంతో న్యాయంగా అనిపించింది. దానికి ఉదాహరణ ఎవరో కాదు నేనే, మా ఇంట్లో 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు వయస్సు ఉన్న మనవళ్ళు మనవరాళ్లు ఉన్నారు.

Written By: Vicky, Updated On : August 20, 2024 1:56 pm

Chiranjeevi Comments

Follow us on

Chiranjeevi : మూడు దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ ని నెంబర్ 1 స్థానంలో కూర్చొని ఏ స్థాయిలో శాసించాడో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయన స్థానానికి ఎవ్వరూ చేరుకోలేకపోయారు అంటే, మెగాస్టార్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మధ్యలో ఆయన సినీ ఇండస్ట్రీ ని వదిలి, రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల కొత్త తరం హీరోలకు స్టార్స్ అయ్యే అవకాశం వచ్చింది. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ ని కుమ్మిన కుమ్ముడు ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్, రాజమౌళి తర్వాత ఇండస్ట్రీ లో అత్యధిక వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలు ఉన్నది కేవలం మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే. ఇప్పటికీ టాలీవుడ్ లో వంద కోట్ల రూపాయిల షేర్ లేని స్టార్ హీరోలు ఉన్నారు. అలాంటిది చిరంజీవి కి 70 ఏళ్ళ వయస్సులో కూడా మూడు వంద కోట్ల సినిమాలు ఉన్నాయంటే ఆయన స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

మారుతున్న జనరేషన్స్ కి తగ్గట్టుగా తనని తాను మార్చుకోవడం మెగాస్టార్ చిరంజీవి స్టైల్. అందుకే ఆయన ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా చలామణి అవుతున్నాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రీసెంట్ గా ఆయన సూన్యం నుండి శిఖరాగ్రాలకు అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ సూన్యం నుండి శిఖరాగ్రాలకు అనే టైటిల్ ని ఈ పుస్తకానికి పెట్టడం ఎంతో న్యాయంగా అనిపించింది. దానికి ఉదాహరణ ఎవరో కాదు నేనే, మా ఇంట్లో 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు వయస్సు ఉన్న మనవళ్ళు మనవరాళ్లు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు రామ్ చరణ్, అల్లు అర్జున్ సాంగ్స్ వింటూ ఉంటే నాకు మండిపోయేది. అదేంటి నాకు కూడా ఎన్నో మంచి పాటలు ఉన్నాయి కదా, అవి ఎందుకు వినరు అని కోపం వచ్చేది. కరోనా సమయంలో ఇలాంటి అనుభవం ఎదురైంది. నా గురించి నేను చెప్పుకునే దుస్థితి నా ఇంట్లోనే ఎదురు అయ్యింది. పక్కన ఎవరు లేని సమయం లో చూసుకొని వాళ్లకి నా సినిమాలను చూపించేవాడిని. నా పాటలు సినిమాలు వేసి చూపించాను. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైంది అంటే నా గాడ్ ఫాదర్ చిత్రాన్ని నాలుగు సార్లు చూసారు. అందులో చిన్నపిల్లలు ఆకర్షితులు అయ్యేంత ఏముంది అని నేను వాళ్ళని అడగగా, లేదు ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి,అద్భుతంగా ఉంది అని మెచ్చుకుంటున్నారు. రెండు తారలు మారేసరికి నా గురించి నేను ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది. అలాంటిది మన చరిత్ర నేటి తరానికి తెలియాలనే ఉద్దేశ్యం ఇలాంటి పుస్తకాలు రావడం వల్ల నెరవేరుతుంది’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వం లో ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆగష్టు 22 వ తారీఖున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అదే రోజున చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఇంద్ర’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.