Chiranjeevi Comedy Scenes New Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఆయన గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు.ఇక ఈ ఎంటైర్ జర్నీ లో చిరంజీవి అభిమానిగా మారని వాళ్ళు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన తన సినిమాలతో, డ్యాన్సులతో, ఫైట్లతో ప్రేక్షకులందరిని రంజింప చేస్తున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన సినిమాలు చేస్తున్నాడు అంటే ఆయనకు సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. బాబీ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కామెడీకి కూడా పెద్దపీట వేస్తుంటాడు. కాబట్టి ఈ సినిమాలో చిరంజీవి చేత ఫుల్ లెంత్ కామెడీ కూడా చేయించాలనే ప్రయత్నంలో బాబీ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ మాత్రం చాలా హిలేరియస్ గా ఉంటుందట. ప్రేక్షకులందరు పడి పడి నవ్వుతారని బాబీ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. అందులో వింటేజ్ చిరంజీవిని కూడా మనం చూడొచ్చని ఆయన చాలా కాన్ఫిడెంట్ తో చెబుతుండడంతో మెగాస్టార్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా మీద అంచనాలను పెంచేసుకుంటున్నారు…
ఇక ఇందులోనే చంటబ్బాయి మూవీలోని కామెడీ స్టైల్ ను సైతం ఫాలో అవుతున్నారట. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి వశిష్ట డైరెక్షన్లో చేసిన విశ్వంభర సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఎక్కడ చెప్పడం లేదు. ఎందుకని ఈ సినిమాను ఇంత డీలే చేస్తున్నారు అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం సినిమా యూనిట్ ను విమర్శిస్తున్నారు.
నిజానికి సినిమాలోని సిజి వర్క్ అంత ఎఫెక్ట్ గా రాలేదని అందువల్లే సినిమాని మేకర్స్ రిలీజ్ చేయడానికి భయపడుతున్నారని తెలుస్తుంది. ఇక దానికోసం ఆల్టర్నేట్ గా ఏదైనా ఆలోచిస్తున్నారా? లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు. వీలైనంత తొందరగా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకొస్తేనే మంచిది లేకపోతే మాత్రం సినిమా మీద ఉన్న ఆ మాత్రం బజ్ కూడా పోయి ప్రేక్షకులను నిరాశపరిచే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయని చెబుతుండడం విశేషం…