Homeబిజినెస్MPV Segment Sales February 2026 India: MPV సెగ్మెంట్ అమ్మకాల్లో ఈ కంపెనీలదే హవా.....

MPV Segment Sales February 2026 India: MPV సెగ్మెంట్ అమ్మకాల్లో ఈ కంపెనీలదే హవా.. ఏ కారు ఎన్ని యూనిట్లు అమ్మిందంటే?

MPV Segment Sales February 2026 India: సొంత అవసరాలతో పాటు కార్యాలయ అవసరాలకు.. దూర ప్రయాణాలు చేసేందుకు ఫోర్ వీలర్ అవసరం తప్పనిసరిగా మారింది. మార్కెట్లో ఎన్నో రకాల ఫోర్ వీలర్స్ ఉండగా.. Multi Purpose Vehicle(MPV) లకు ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది. అంతేకాకుండా వీటి నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా 2026 ఫిబ్రవరి నెలలో అత్యధికంగా కొన్ని కంపెనీలకు చెందిన ఎంపీవీలు విక్రయాలు చేసుకున్నాయి. ఆ కంపెనీలు ఏవో ఇప్పుడు చూద్దాం..

MPV వేరియంట్ లో ఫిబ్రవరి నెలలో అమ్మకాల వృద్ది ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ సెగ్మెంట్ అమ్మకాలు 42,482 ఉన్నాయి. 2025 ఫిబ్రవరి నెలలో 34,556 ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 22.9 శాతం వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సెగ్మెంట్లో మూడు కంపెనీలకు చెందిన కార్లు అత్యధికంగా విక్రయాలు జరిగాయి. వాటిలో మారుతి, టయోటా, కియా కంపెనీలు టాప్ పొజిషన్ లో ఉన్నాయి.

మారుతి సుజుకి కంపెనీకి చెందిన Ertiga ఫిబ్రవరి నెలలో 17,807 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది. 2025 ఫిబ్రవరి నెలలో ఈ కారును 8,449 మంది కొనుగోలు చేశారు. 3.0 శాతం మెరుగుపడింది. టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా కారు 2026 ఫిబ్రవరి నెలలో 8,703 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది. గత ఏడాది ఈ కారును 5,318 మంది కొనుగోలు చేశారు. దీంతో 28.1 శాతం అమ్మకాల వృద్ది సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కియా కంపెనీకి చెందిన కేరెన్స్ MPV కారులో ఫిబ్రవరి నెలలో 6,815 మంది వినియోగదారులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారు గత ఏడాది కంటే ఈ ఏడాది 16.0% వృద్ధి సాధించినట్లు కనబడుతోంది.ఆ తర్వాత మారుతి సుజుకి కంపెనీకి చెందిన XL 6 కారును ఫిబ్రవరి నెలలో 3,633 మంది వినియోగదారులు కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ కారు ఈ సంవత్సరం 8.6 డెవలప్ తో ముందుకు వెళ్తుంది.

రెనాల్ట్ కంపెనీకి చెందిన ట్రైబర్ కూడా ఎంపీ విభాగంలో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనిని 2,419 మంది వినియోగదారులు కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే నెలలో 1,545 అమ్మకాలు సాగాయి. ఏడాదిలో ఈ కారు 56.6% అమ్మకాల వృద్ధి సాగించింది. టయోటా కంపెనీకి చెందిన రూమియన్ కారు సైతం ఫిబ్రవరి నెలలో 2,817 యూనిట్ల అమ్మకాలతో 34.2% వృద్ధిని సాధించింది..

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular