Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది… ఇప్పటికి చిరంజీవి కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడు. కానీ తను డిఫరెంట్ సినిమాలను చేయాలని ఆలోచించడం లేదు. నిజానికి ఆయన నుంచి వచ్చే సినిమాలన్నీ అతన్ని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాయి. కానీ ఆయన మాత్రం ఈ ఏజ్ లో కూడా కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడు. ఎందుకని అలాంటి సినిమాలు చేస్తున్నాడు అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సక్సెస్ ఫుల్ సినిమాలను చేయడమే తన ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేసి విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఆయన బాటలోనే ముందుకు సాగుతున్నాడు…
బాబీ డైరెక్షన్లో సినిమా పూర్తయిన తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నాని ని హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే చిరంజీవితో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి.
ఈ సినిమా సక్సెస్ అయితేనే చిరంజీవి సినిమా ఉంటుంది. లేకపోతే మాత్రం చిరంజీవి శ్రీకాంత్ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ లాంటి దర్శకుడు చిరంజీవి కి అవకాశం ఇస్తే అతన్ని చాలా డిఫరెంట్ గా చూపిస్తాడని పలువురు సినిమా మేధావులు సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వాళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళ కాంబినేషన్లో సినిమా పడితే అద్భుతంగా ఉంటుందని వాళ్ల అభిమానులు సైతం భావిస్తున్నారు… మొత్తానికైతే చిరంజీవి ఒక క్లారిటితో ముందుకు సాగుతున్నాడు…ఇదే బాటలో నడుస్తూ ఆయన వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని చూస్తున్నాడు…
