Bigg Boss Tamil Season 9: మన తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు రెడ్ కార్డు ఎలిమినేషన్ జరగలేదు. రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు కానీ, రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేంత కఠినంగా మాత్రం ఎప్పుడూ వ్యవహరించలేదు. సీజన్ 6 లో రేవంత్ దూకుడుగా ఆడుతూ కంటెస్టెంట్స్ ని గాయపరుస్తుండేలోపు అతనికి ఒకసారి రెడ్ కార్డు వార్నింగ్ ఇస్తాడు నాగార్జున. ఇక ఆ తర్వాత సీజన్ 8 లో బిగ్ బాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభి కి కూడా రెడ్ కార్డు వార్నింగ్ ఇవ్వగా, ఈ సీజన్ లో డిమోన్ పవన్ కి కూడా ఇదే వార్నింగ్ ఇస్తాడు నాగార్జున. కానీ ఎవ్వరినీ ఎలిమినేట్ మాత్రం చేయలేదు. కానీ తమిళ బిగ్ బాస్ షో లో రెడ్ కార్డు ఎలిమినేషన్స్ అనేవి సర్వ సాధారణం అయిపోయింది. సీజన్ 7 లో టైటిల్ విన్నర్ అయ్యేంత సత్తా, ఓటింగ్ లో ఉన్న వ్యక్తిని ఇలాగే ఎలిమినేట్ చేశారు.
అప్పట్లో ఆ ఎలిమినేషన్ పై జనాల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. హోస్ట్ గా వ్యవహరించిన కమల్ హాసన్ ని నెటిజెన్స్ ఒక రేంజ్ లో తప్పుబట్టారు. ఇక ప్రస్తుతం నడుస్తున్న సీజన్ లో నిన్న ఇద్దరినీ రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేశారు. అందుకు ఆడియన్స్ మొత్తం చప్పట్లు, ఈలలతో హోస్ట్ విజయ్ సేతుపతిని ప్రశంసించారు. ఆడియన్స్ లో అంత వ్యతిరేకత రప్పించుకునేంతగా ఈ కంటెస్టెంట్స్ ఏమి చేశారో ఒకసారి చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఖమ్రుద్దీన్, వీజే పారు అలియాస్ పార్వతి అని ఇద్దరు కంటెస్టెంట్స్ ఉంటారు. వీళ్లది ఈ సీజన్ లో లవ్ ట్రాక్ అన్నమాట. హద్దులు దాటి మరీ ముద్దులు పెట్టుకోవడం, హగ్గులు చేసుకోవడం వంటివి చూసి ఆడియన్స్ కి చిరాకు కలిగేది. దీనిపై కంటెస్టెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు, చివరికి హోస్ట్ విజయ్ సేతుపతి కూడా అభ్యంతరం వ్యక్తం చేసాడు.
కానీ వీళ్ళు మాత్రం మారలేదు. అదే రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వచ్చారు. మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో షణ్ముఖ్, సిరి మధ్య ఎలాంటి రొమాన్స్ ఉండేదో మనమంతా చూసాము. అందుకు పదింతలు ఎక్కువ రొమాన్స్ వీళ్ళ మధ్య ఉండేది అన్నమాట. అయితే నిన్న బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరిగింది. ఒక కారులో కంటెస్టెంట్స్ అందరూ కూర్చుంటారు, ఒకరిని ఒకరు కారు నుండి తోసుకోవడానికి లేదు, అన్నం , నీళ్లు, నిద్ర, బాత్రూం ఏమి లేకుండా కారులోనే ఉండాలి. అలా ఎవరైతే ఓపికతో చివరి వరకు ఉంటారో, వాళ్ళు ఆ టాక్ లో గెలిచి టికెట్ టు ఫినాలే విజేతలుగా నిలుస్తారు. ఈ టాస్క్ లో కారు లోపల చాలా పెద్ద గొడవలే జరిగాయి. ఖమ్రుద్దీన్, పారు, సాండ్రా అనే కంటెస్టెంట్స్ ముగ్గురు పక్కపక్కనే కూర్చుంటారు.
సాండ్రా ఖమ్రుద్దీన్ ని పారు ని రెచ్చగొడుతూ కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. నువ్వు పెద్ద కామిస్ట్ గాడివి, ఈ బిగ్ బాస్ హౌస్ లోకి పారు తో రొమాన్స్ చేయడానికే వచ్చావ్ అని అంటుంది. అప్పుడు నీకు, మీ భర్త కి కామం ఉండడం వల్లే కదా మీకు పిల్లలు పుట్టారు అని అంటాడు ఖమ్రుద్దీన్. అప్పుడు సాండ్రా నా భర్త గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడిన చెప్పు విరిగేలా కొడుతాను అంటుంది, అప్పుడు ఖమ్రుద్దీన్ నేను పాత చెప్పు విరిగేలా కొడుతాను అని అంటాడు. అలా వీళ్ళ మధ్య మంచి ఫైర్ వాతావరణం నెలకొంటుంది. ఈ క్రమం లో పారు కోపం తో సాండ్రా ని అతి దారుణంగా ఫిజికల్ అవుతూ కారు నుండి బయటకు తోసేస్తుంది. ఆమెని మెడికల్ రూమ్ కి తీసుకెళ్తారు, ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ పారు, ఖమ్రుద్దీన్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతారు.
ఇక శనివారం ఎపిసోడ్ లో విజయ్ సేతుపతి ఈ వ్యవహారం పై స్పందిస్తూ ఇద్దరికీ రెడ్ కార్డ్స్ ఇచ్చి బయటకు పంపేస్తారు. వెళ్లే ముందు పారు సాండ్రా కి క్షిపణలు చెప్తుంది, ఆమె ఆ క్షమాపణలు స్వీకరించదు, అదే విధంగా ఖమ్రుద్దీన్ సాండ్రా కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణలు చెప్తాడు , అయినప్పటికీ ఆమె స్వీకరించదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో సాండ్రా తప్పు కూడా ఉంది, ఆమె అలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా ఉండుంటే , ఇదంతా జరిగేది కాదేమో. అంతే కాకుండా, ఆమెకు పెద్దగా దెబ్బలు కూడా తగిలినట్టు అనిపించలేదు , ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఈ ఘటన జరిగిన తర్వాత పారు, ఖమ్రుద్దీన్ ని చూసి భయపడినట్టు ప్రవర్తించింది. కానీ ఆ తర్వాత మాత్రం మామూలుగానే ఉన్నింది , ఇదంతా చూసిన తర్వాత సాండ్రా నటించిందా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఈ ఘటనపై సంబంధించిన వీడియో ని మీకు క్రింద అందిస్తున్నాము చూడండి.
Wtf is red card, both deserves jail sentence man ♀️♀️♀️#BiggBossTamil9 #BiggBoss9Tamil
pic.twitter.com/ANrsTg86oQ— AiShRish ♀️ (@Aishrish20) January 2, 2026