Chiranjeevi Anil Ravipudi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఆయన ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తనని తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు. ‘ వాల్తేరు వీరయ్య’ సినిమాతో ఒక మంచి సక్సెస్ ని అందుకున్నప్పటికి అది ఆయన రేంజ్ సక్సెస్ అయితే కాదు. మరి ‘ అనిల్ రావిపూడి’ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకొని చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఇప్పటికే ఆయన ఈ సినిమా కోసం చాలా రకాలుగా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిరంజీవి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి అది చాలా హెల్ప్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి సూపర్ హిట్ సినిమా అయిన దొంగ మొగుడు సినిమా నుంచి ఒక సీన్ ను రీ క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి అందులో చిరంజీవి చాలా కామెడీగా నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నాడట.
Also Read: బోయపాటి శ్రీను మీద పంచ్ వేసిన సందీప్ రెడ్డి వంగ…వైరల్ వీడియో…
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా వల్ల చిరంజీవి క్రేజ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి హామీ ఇస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన ఈ సినిమా యూనిట్ తొందర్లోనే నాలుగోవ షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
మరి వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేస్తే అనిల్ రావిపూడి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీ కానున్నట్టుగా తెలుస్తోంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాను తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను చాలా ఫాస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. మరి తను అనుకున్నట్టుగా ఈ సినిమా చేయగలుగుతున్నాడా?
Also Read: 5వ రోజు దారుణంగా పడిపోయిన ‘కింగ్డమ్’ వసూళ్లు..ఎంత వచ్చిందంటే!
లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే… మరి ఏది ఏమైనా కూడా చిరంజీవికి అనిల్ రావిపూడి ఈ సినిమాతో సక్సెస్ ని అందిస్తే వీళ్ళ కాంబో లో మరో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అనిల్ రావిపూడి చాలా కమిట్ మెంట్స్ ఉండటం వల్ల చిరంజీవి సినిమా తర్వాత ఆయన వెంటనే వెంకటేష్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…