Chiranjeevi and Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడంలో ఆయన కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి లాంటి నటుడు ఈ ఏజ్ లో సైతం భారీ ఎక్స్పరిమెంటల్ సీన్స్ లో పాల్గొంటూ ఎలాంటి డూప్ లేకుండా నటిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం కూడా చేస్తూ వస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూట్ కి వెళ్లబోతున్నది. దానికోసం చిరంజీవి భారీ కసురత్తులు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
ఇక ఈ విషయం మీద అనిల్ రావిపూడి గాని, చిరంజీవిగాని ఎలాంటి క్లారిటి ఇవ్వనప్పటికి సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే చెక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా ‘దొంగ మొగుడు’ (Donga Mogadu)సినిమాకి రీమేక్ గా రాబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో చిరంజీవి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
తద్వారా ఆయనకంటూ ఒక భారీ ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… అనిల్ రావిపూడి సినిమా అంటే రొటీన్ కమర్షియల్ సినిమా లాగే ఉంటాయి. కాబట్టి ఆయన దొంగ మొగుడు సినిమాని రీమేక్ చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే చిరంజీవి సినిమాల్లో మంచి కమర్షియల్ సినిమాగా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన సినిమా దొంగ మొగుడు…అలానే ఇప్పుడు కూడా చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించి ఆ ఎనర్జీ ని రీ క్రియేట్ చేయగలిగితే మాత్రం ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది.
ఇక అనిల్ రావిపూడి వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. ఈ సినిమాతో తొమ్మిదో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్ తనను తాను పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఇటు చిరంజీవికి అటు అనిల్ రావిపూడి కి ఎలాంటి క్రేజ్ క్రియేట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?