Chiranjeevi-Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర (Vishvambhara) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు రీసెంట్ గా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ మూవీలో వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నాం అంటూ అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. దాంతో పాటుగా చిరంజీవిలోని కామెడీ యాంగిల్ ని అలాగే తనలోని మాస్ ఇమేజ్ ని మరోసారి బయటకు తీయాలనే ఉద్దేశ్యం తో అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ‘పెద్ది’ మూవీలో రామ్ చరణ్ ఆ వ్యక్తి కోసం క్రికెట్ ఆడతాడా..? కథ మామూలుగా లేదుగా…
ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో చిరంజీవికి భారీ సక్సెస్ ని అందించడమే కాకుండా తను కూడా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోవాలనే ఉద్దేశ్యంతో వరుసగా తొమ్మిదో విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా అతనికి మంచి గుర్తింపుని తీసుకొస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ చల్ అడిఫరెంట్ గా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఎవరు అనేది ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతారట. ఇంటర్వెల్ లో చిరంజీవి ఎవరు అనేది ఎలివేట్ చేసి ఆ తర్వాత అతని ఫ్లాష్ బ్యాక్ ను ఓపెన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటి వరకు ఇలాంటి స్టోరీ తో చాలా సినిమాలు వచ్చినప్పటికి అనిల్ రావిపూడి తన ట్రీట్ మెంట్ తో ఈ సినిమా ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాడట. అయితే చిరంజీవి ఒక డాన్ గా కూడా కనిపించబోతున్నాడట. మరి వేరే దగ్గరికి వెళ్లి ఎందుకు తల దాచుకున్నాడు అనేది స్టోరీగా తెలుస్తోంది. ఇంటర్ వెల్ లో మాత్రం ఒక భారీ బ్యాంగ్ ఇచ్చి ప్రేక్షకుల్ని ఒక హై ఫీల్ లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read : అల్లు అర్జున్ అట్లీ ని బ్లైండ్ గా నమ్ముతున్నాడా..?