Childhood Photo : భారీ అంచనాలతో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో అభిమానులందరూ రామ్ చరణ నెక్స్ట్ సినిమా పెద్ది మీద భారీగా అసలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఇప్పటివరకు నటించిన సూపర్ హిట్ సినిమాలలో రచ్చ సినిమా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రచ్చ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం సాధించింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ చిన్ననాటి పాత్రలలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండి ఉంటారు. సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన తర్వాత చాలామంది హీరోలుగా, హీరోయిన్లుగా కూడా మారిన వాళ్లు ఉన్నారు. మొన్నటి వరకు తెలుగు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా క్యూట్ గా కనిపించిన వాళ్ళు ప్రస్తుతం సినిమాలలో హీరో, హీరోయిన్లుగా అదిరిపోయే మేక్ ఓవర్ తో అందరికీ షాక్ ఇస్తున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్లు ప్రస్తుతం హీరో హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు. ఈమధ్య కాలంలో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు. తేజ సజ్జ ఒకప్పుడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం స్టార్ హీరోగా సినిమాలలో నటిస్తున్నాడు. అలాగే కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్గా సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Also Read : అల్లు అర్జున్ అట్లీ ని బ్లైండ్ గా నమ్ముతున్నాడా..?
ఇలా చాలామంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్లే. ప్రస్తుతం ఈ జాబితాలోకి మరొక బ్యూటీ కూడా చేరింది. ఈ చిన్నది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రచ్చ సినిమాలో హీరోయిన్ తమన్నా చిన్ననాటి పాత్రలో నటించింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన రచ్చ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా చిన్ననాటి పాత్రలో క్యూట్గా నటించిన చిన్నారి అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఈ చిన్నా ఈ ప్రస్తుతం హీరోయిన్గా మారి సినిమాలలో నటిస్తుంది. ఈమె పేరు విషికా కోట.
తగిలేటి కథ, ఏందిరా ఈ పంచాయతీ వంటి సినిమాలలో నటించి ఈ బ్యూటీ తన అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరి కొన్ని సినిమాలలో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. గతంలో ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. రచ్చ మూవీ షూటింగ్ సమయంలో రామ్ చరణ్, తమన్నాను కలవలేదు. చిన్ననాటి సన్నివేశాలు చిత్రీకరణ కాబట్టి వాళ్లు అప్పుడు అక్కడ లేరు. వారికి ఇప్పుడు నేను కనిపించనేమో అంటూ అప్పటిలో జరిగిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది.