https://oktelugu.com/

Tollywood: వైసీపీ మాజీ ఎంపీ పుట్టినరోజు వేడుకల్లో చిరంజీవి, మహేష్ బాబు..వైరల్ అవుతున్న వీడియో!

2024 లో కచ్చితంగా ఈయనకి ఎంపీ టికెట్ వచ్చేది. కానీ మనోడు కుదురుగా ఒక చోట ఉండదు కదా, పవర్ లో లేని టీడీపీ లో ఉండలేక వైసీపీ కి తిరిగి వచేసాడు. ఇలా పూటకి ఒక పార్టీ మారుతున్న సునీల్ పై కాకినాడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 14, 2024 / 01:55 PM IST

    Tollywood(11)

    Follow us on

    Tollywood: రాజకీయ జీవితం లో అదృష్౫టం లేని నాయకుడు ఎవతైన ఉన్నారా అంటే అది కాకినాడ వైసీపీ పార్టీ ఎంపీ పోటీదారుడు చలమశెట్టి సునీల్. ఈయన మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుండి 2009 వ సంవత్సరం లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి 34 వేల ఓట్లతో ఓడిపోయాడు. ఆ తర్వాత అదే స్థానం నుండి 2014 వ సంవత్సరంలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేసి కేవలం 14 వేల ఓట్లతో ఓడిపోయాడు. ఇలా 5 సంవసరాలలో రెండు పార్టీలు మారి పోటీ చేసి ఓడిపోయిన చలమసెట్టి సునీల్ 2019 ఎన్నికలలో టీడీపీ నుండి పోటీ చేసి మూడవసారి కూడా ఓడిపోయాడు. ఇలా ప్రతీసారీ ఆయన చిన్న మార్జిన్ తో ఓడిపోతూ రావడం కాకినాడ ప్రజల్లో ఈయనపై కాస్త సానుభూతి కలిగేలా చేసింది. కుదురుగా అదే టీడీపీ లో ఉండుంటే, 2024 లో కచ్చితంగా ఈయనకి ఎంపీ టికెట్ వచ్చేది. కానీ మనోడు కుదురుగా ఒక చోట ఉండదు కదా, పవర్ లో లేని టీడీపీ లో ఉండలేక వైసీపీ కి తిరిగి వచేసాడు. ఇలా పూటకి ఒక పార్టీ మారుతున్న సునీల్ పై కాకినాడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

    ఇలా తక్కువ ఓట్లతో కాదు, ఈసారి కొడితే రాజకీయాల్లో నుండి తప్పుకొని పారిపోవాలి అనే రేంజ్ కొట్టారు. 2024 ఎన్నికలలో ప్రత్యర్థి జనసేన పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతిలో 2 లక్షల 30 వేల ఓట్ల మెజారిటీ తో ఓడిపోయాడు. ఈ దెబ్బకి ఆయన రాజకీయాల నుండి తప్పుకున్నట్టే అనుకోవాలి. పారిశ్రామిక వేత్తగా, గ్రీ కో సంస్థ అధినేత గా చలమసెట్టి సునీల్ వ్యాపార రంగంలో దిగ్గజం లాగా రాణించాడు. ఎన్నో వందల కోట్ల రూపాయిల ఆస్తిని సంపాదించాడు. కానీ దురదృష్టం ఇతన్ని వెంటాడుతుండడం వల్ల రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈయన తన 50 వ ఏటలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలకు టాలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం తరళి వచ్చింది. చలమశెట్టి సునీల్ స్వతహాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.

    రాజకీయంగా వేరువేరుగా ఉన్నప్పటికీ వీళ్లిద్దరు కుటుంబ సభ్యులు లాగ కలిసిమెలిసి ఉంటారు . అయితే సునీల్ కి కేవలం చిరంజీవి తో మాత్రమే కాకుండా మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున వంటి వారితో కూడా మంచి సాన్నిహిత్యం ఉందని, ఈ పుట్టినరోజు వేడుకలు చూసిన తర్వాతే అర్థమైంది. మాల్దీవ్స్ లో జరిగిన ఈ ఈవెంట్ లో సునీల్ తో కలిసి గడిపిన సరదా క్షణాలు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అభిమానులు ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.