Chiranjeevi And Bobby: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు కోరుకుంటాడు. ఎందుకంటే అలాంటి నటుడు దొరికినప్పుడే వాళ్ళ డైరెక్షన్ ఎలివేట్ అవుతుంది…గత 50 సంవత్సరాల నుంచి చిరంజీవి ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఆయనను చూసి ఇండస్ట్రీకి వచ్చిన దర్శకులు అతనితో సినిమాను చేసి తమ అభిమానాన్ని చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక బాబీ లాంటి దర్శకుడు ఇంతకుముందు చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. దాంతో వీళ్లిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడాలి అని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే చిరంజీవి సైతం బాబీ తో మరోసారి సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి బాబీ కాంబోలో వస్తున్న సినిమాలో ఆయన 50 సంవత్సరాల పైబడిన వ్యక్తి క్యారెక్టర్ ను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో తనకి ఒక కూతురు కూడా ఉంటుంది. అలాగే తనకి ఒక సిస్టర్ కూడా ఉంటుందట. అటు కూతురు సెంటిమెంట్ ఇటు సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మూవీ ఇంటర్వెల్లో చిరంజీవి కూతురే తనని చంపడానికి ప్రయత్నం చేసి తన మీద మర్డర్ అటెంప్ట్ చేస్తుందట.
మరి తను ఎందుకు అలా చేస్తుంది? చిరంజీవి తనకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టాడా? లేదంటే ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ఉందా? అసలు ఆమె నిజంగానే తన కూతురా? కాదా అనేది ట్వీట్ గా తెలుస్తోంది…ఇక ఇందులో కూతురు క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతుందా? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ప్రస్తుతానికైతే ఈ లీక్ తో మెగా అభిమానులు కొంతవరకు కథలో ఏదో వైవిధ్యం ఉందని సంతోషపడుతున్నారు. కానీ లీక్ వచ్చినందుకు వాళ్ళు కొంతవరకు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఈ సినిమాలో మరో యాంగిల్ లో మనకు కనిపించబోతున్నాడు అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. రీసెంట్ గా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో ఫ్యామిలీ మెన్ గా కనిపించిన ఆయన ఈ సినిమాలో మాస్ అవతారం ఎత్తబోతున్నట్టుగా తెలుస్తోంది…