Chiranjeevi And Balakrishna Daughters: సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. గత 50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గా వెలుగొందుతున్నాడు. 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కొద్దిరోజుల పాటు పొలిటికల్ గా ముందుకు సాగినప్పటికి రాజకీయం అతనికి పెద్దగా కలిసి రాలేదు. దాంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదరగొడుతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. చిరంజీవి తన కూతురు అయిన సుస్మిత ను ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా పరిచయం చేస్తున్నాడు.
ఇంతకుముందు ఆమె ఒకటి రెండు చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేసినప్పటికి అవి పెద్దగా కలిసిరాలేదు. దాంతో మరో సారి తన సినిమాతో ప్రొడ్యూసర్ గా రీ లాంచ్ చేస్తున్నాడు. ఆమె సాహు గారపాటి గారితో కలిసి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.మొత్తానికైతే చిరంజీవి తన కూతుర్ని సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా నిలబెట్టలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక నందమూరి నటసింహం గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు సైతం ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ గొప్ప విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను సాధించిన బాలయ్య ఇప్పుడు ఐదో విజయం మీద కన్నేసాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో భారీ విక్టరీని సాధించడానికి డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
ఇదే క్రమంలో బాలయ్య బాబు సైతం తన చిన్న కూతురు అయిన తేజస్విని ని ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించే అవకాశాన్ని కల్పించాడు. రామ్ అచంట, గోపి అచంటలతో పాటు తేజస్విని కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… మరి అటు చిరంజీవి కూతురు, ఇటు బాలయ్య బాబు కూతురు ఇద్దరు కూడా ప్రొడ్యూసర్లుగా రాణిస్తారా? వాళ్ళ ఫాదర్స్ తోనే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు చేసే స్థాయికి ఎదుగుతారా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…