spot_img
Homeఎంటర్టైన్మెంట్నిహారిక పెళ్ళిలో రచ్చ చేసిన మెగా అండ్ అల్లు దంపతులు !

నిహారిక పెళ్ళిలో రచ్చ చేసిన మెగా అండ్ అల్లు దంపతులు !

Chiranjeevi and Allu Arjun
తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా విన్నా ప్రస్తుతం ‘కొణిదెల’ వారి ఇంటి పెళ్లి సందడి గురించే హాట్ ట్రేండింగ్ టాపిక్ వినిపిస్తుంది. గుంటూరు రేంజ్ ఐజీ జొన్నల గడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక మ్యారేజ్ డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. కరోనా కారణంగా రాజస్తాన్‌ ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌ మెగా డాటర్‌ వివాహ వేడుకకు వేదిక కాబోతోంది. ఈ శుభకార్యానికి మెగా హీరోలు అందరూ హాజరయ్యి సందడి చేశారు. చాతుర్మాస్య దీక్ష కారణంగా నిహారిక నిశ్చితార్థ వేడుకకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ పెళ్లికి మాత్రం కుమారుడు అకిరానందన్‌తో కలిసి ఉదయ్‌పూర్‌ చేరుకుని … నిహారిక మెహందీ ఫంక్షన్‌లో సోదరులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు.

Also Read: ‘స‌ర్కారు వారి పాట’‌.. క‌థ‌లో కీల‌క‌మైన మార్పులు !

మరి నిహారిక పెళ్లిలో ఒక్కచోట చేరిన మెగా ఫ్యామిలీ సందడి ఎలా ఉందో అని అభిమానులు ఫీల్ అవుతారని భావించి కాబోలు మ్యారేజ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి అందిస్తున్నారు. వీటిని చూస్తున్న మెగా అభిమానులలో కూడా ఒకవిధమైన సందడి నెలకొంది. నాగబాబు ముద్దుల తనయ నీహారిక పెళ్లి కళతో ధగధగా మెరిసిపోతోంది. ఇక ఈ వేడుకలో మెగాస్టార్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. హైలెట్ ఏంటంటే ఈ వయసులో కూడా మెగాస్టార్ చిరు తనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని మేనల్లుడు అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులు వేసి మరీ నిరూపించేసుకున్నారు. చివరికి అల్లు అరవింద్ తన భార్యతో కలిసి చిరు పాట రామ చిలకమ్మా కి స్టెప్పులేయటంతో అందరిలో జోరు ఆకాశాన్ని తాకేసింది.

Also Read: నిహారిక కు చిరంజీవి కాస్ట్లీ గిఫ్ట్… ఏకంగా కోట్లలో..!

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకలో ఉండడంతో అన్నదమ్ములు ఈ పెళ్లి వేడుకలో హైలెట్ గా నిలిచారు. మెగాస్టార్ చిరు బన్నీ తో కలిసి “బంగారు కోడిపెట్ట వచ్చెనండి” సాంగ్ కు స్టైలిష్ స్టెప్పులు వేయడం, చివర్లో చిరు భార్య సురేఖ కూడా కాలు కదపడంతో … నిహారిక వివాహ వేడుకకు మరికాస్త అందం సంతరించుకుంది. నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ సోదరి పెళ్ళి పనుల్ని దగ్గరుండి చూసుకుంటూ హంగామా చేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఆనందంతో కూతురితో కలిసి డాన్సులు వేస్తూ ఉత్సాహంగా ఉన్నారు. నిహారిక పెళ్లిలో మెగా కుటుంబం మొత్తం కలిసి రెచ్చిపోయి రచ్చ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES
spot_img

Most Popular