Childhood Photo : తాజాగా ఒక స్టార్ హీరోయిన్ ఆర్మీ జవాన్ అయిన తన తండ్రితో కలిసి దిగిన చిన్ననాటిఫోటో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఫోటోలు ఆర్మీ జవాన్ తో పాటు ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఈ బ్యూటీ తెలుగుతోపాటు, హిందీ, తమిళ్, కన్నడలో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాగా ఫేమస్ అయ్యింది. తెలుగులో అయితే ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ, రామ్ పోతినేని, నాగార్జున, గోపీచంద్ వంటి దాదాపు అందరూ స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ బ్యూటీ కి బాగా క్రేజ్ ఉంది. హిందీలో ఈమె అజయ్ దేవగన్, ఆయుష్మాన్ ఖురానా వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించింది.
కెరియర్ బాగా స్పీడ్ గా ఉన్న సమయంలోనే ఈ చిన్నది పెళ్లి చేసుకుంది. బాలీవుడ్కు చెందిన ఒక ప్రముఖ నిర్మాతను ఈ హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయినా కూడా ఈ హీరోయిన్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు అని చెప్పొచ్చు. తెలుగులో ఈ బ్యూటీ సినిమాలు చేయనప్పటికీ హిందీలో మాత్రం వరుస సినిమాలలో నటిస్తుంది. మనం చెప్పుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయింది. సోషల్ మీడియాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల ఈ హీరోయిన్ తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది.
అంతర్జాతీయంగా సాయుధ దళాల దినోత్సవం ఉండవచ్చు కానీ నా మనసు మాత్రం మా నాన్న యూనిఫామ్ కోసం కొట్టుకుంటుంది. ఒక ఆర్మీ అధికారి తల్లిదండ్రులుగా వారి సంరక్షణలో పెరగడం అంటే త్యాగం, గౌరవం, బాధ్యతలను ముందుగానే నేర్చుకోవడం అని తెలిపింది. నేను మా నాన్నను మాత్రమే కాదు ఈరోజు భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా తమ కంటే కూడా తమ సేవను మాత్రమే ముఖ్యమని భావించే ఆర్మీను ఎంచుకునే ప్రతి సైనికుడిని కూడా గౌరవిస్తాను. ఈ మధ్యకాలంలో మన దేశం సైన్యం ధైర్యం, శాంతి ఉచితం కాదని మనకు గుర్తు చేసింది. ఈ క్రమంలో నేను ప్రతి ఒక్క ఆర్మీ జవాన్ కు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని ఎమోషనల్ పోస్ట్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది.