spot_img
Homeఎంటర్టైన్మెంట్Child Artist: చిరంజీవి-రమ్యకృష్ణలతో ఫోటో దిగిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడో హాట్ హీరోయిన్... లేటెస్ట్...

Child Artist: చిరంజీవి-రమ్యకృష్ణలతో ఫోటో దిగిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడో హాట్ హీరోయిన్… లేటెస్ట్ లుక్ చూస్తే మైండ్ బ్లాక్

Child Artist: మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రమ్యకృష్ణలతో ఫోటోకి ఫోజిచ్చిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్. ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు లేటెస్ట్ లుక్ చూసిన నెటిజెన్స్ అవాక్కు అవుతున్నారు. అప్పటి అమాయకపు అమ్మాయి ఇంత గ్లామరస్ గా తయారైందా అని వాపోతున్నారు. ఇంతకీ ఈ పాప ఎవరో మీరు గుర్తు పట్టారా? . ఆమె ఎవరో కాదు నిత్యా శెట్టి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు… ఫస్ట్ మూవీతోనే నంది అవార్డు అందుకుంది నిత్యా శెట్టి.

1999లో విడుదలైన చిన్ని చిన్ని ఆశ చిత్రంతో నిత్యా శెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది. ఆ చిత్రంలోని నటనకు నంది అవార్డు గెలుచుకుంది. 2000లో విడుదలైన దేవుళ్ళు మూవీలో ప్రధాన పాత్ర చేసింది. లిటిల్ హార్ట్స్ చిత్రానికి మరోసారి నంది అవార్డు గెలుపొందింది. చిరంజీవి-కోడి రామకృష్ణ కాంబోలో తెరకెక్కిన అంజి మూవీలో నిత్యా శెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.

ఆ సినిమా షూటింగ్ లో నిత్యా శెట్టి చిరంజీవి, రమ్యకృష్ణలతో ఫోటోకి ఫోజిచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా నిత్యా శెట్టికి అంజి చివరి చిత్రం. తర్వాత ఆమెకు బ్రేక్ తీసుకుంది. 2015లో ఐవరత్తం విడుదలైన తమిళ చిత్రం నిత్యా శెట్టి హీరోయిన్ గా చేసింది. అనంతరం తెలుగులో దాగుడుమూతలు టైటిల్ తో ఒక చిత్రం చేసింది. నువ్వు తోపురా అనే టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో నటుడు సుధాకర్ కి జంటగా లీడ్ హీరోయిన్ రోల్ చేసింది.

జయలలిత బయోపిక్ తలైవి లో ఓ కీలక పాత్ర చేసింది. దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడు మూవీలో ఓ పాత్రలో నిత్యా శెట్టి సందడి చేసింది. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ వంటి నటులు ఆ చిత్రంలో నటించారు. హీరోయిన్ గా నిత్యా శెట్టి అంతగా సక్సెస్ కాలేదు. అందుకే నటనతో పాటు ఉద్యోగం కూడా చేస్తుంది. నిత్యా శెట్టి ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సమాచారం. అలాగే ఇంస్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Nitya Shetty (@nityashettyoffl)

RELATED ARTICLES

Most Popular