Child Artist : చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో అమాయకంగా క్యూట్ గా కనిపించిన ఈ చిన్నారి ప్రస్తుతం చాలా అందంగా మారిపోయింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలో ఉన్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టగలరా. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు అయితే ఈ అమ్మాయిని ఈజీగా గుర్తుపట్టగలరు. మొన్నటి వరకు ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈమె కేవలం ఒక్క సినిమాలో మాత్రమే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి బాగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో చిన్నారి తన అమాయకమైన నటనతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. కేవలం తన భావాలతో అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వందల కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత కూడా ఈమె మరొక సినిమాలో కనిపించలేదు.
Also Read : జాను లిరి రెండో వివాహంపై మాజీ భర్త షాకింగ్ కామెంట్స్…
తన దృష్టి మొత్తాన్ని చదువుపై పెట్టి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది. నిత్యం తన బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తుంది. ఈ ఫోటోలకు అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలను చూసి అందరూ షాక్ అవుతున్నారు. అప్పుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప ఇంత అందంగా మారిపోయింది ఏంటి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భజరంగీ భాయిజాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె పేరు హర్షాలి మల్హోత్రా.
భజరంగీ భాయ్ జాన్ సినిమాలో మున్ని పాత్రలో ఈమె చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాకు ముందు హర్షాలి చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. కుబుల్ హై, లౌట్ ఆవో తృష వంటి పలు సీరియల్స్ లో 2014లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. తనకు ఏడేళ్లు ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిన్నారి టీనేజ్లో తన అందాలతో సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. హర్షాలి మల్హోత్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమెకు ఏకంగా 3.7 మిలియన్స్ ఫాలోవర్లో ఉన్నారు.
View this post on Instagram