Child Artist : మొన్నటి వరకు సినిమాలలో బాలనటులుగా క్యూట్ గా తమ నటనతో ఆకట్టుకున్న వాళ్ళు ఇప్పుడు అదిరిపోయే మేకోవర్ తో హీరో, హీరోయిన్లుగా బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సత్తా చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. తేజ సజ్జ ఒకప్పుడు తెలుగు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాగా క్రేజ్ తెచ్చుకునేవాడు. ఇప్పుడు అతను స్టార్ హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ కూడా ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వారే. అప్పట్లో వీళ్ళు చైల్డ్ ఆర్టిస్టులుగా స్టార్ హీరోల సినిమాలలో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస అవకాశాలను అందుకొని చిన్నతనంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read : అర్చన చేతుల్లో మాయాజాలం ఉందా? మన దేశ పేయింటింగ్స్ ఏకంగా జపాన్ ఉత్సవాల్లో దర్శనం..
ప్రస్తుతం వీళ్లే హీరో హీరోయిన్లుగా కూడా వెండితెరపై సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ సజ్జ హీరోగా మారి సక్సెస్ సాధించాడు. హనుమాన్ సినిమాలో తేజ హీరోగా నటించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే శ్రీవిద్య, కావ్య కళ్యాణ్ రామ్, అనికా సురేంద్రన్, సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, ఎస్తేరు అనిల్ ఇలా చాలామంది చిన్నారులు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా తమ నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ వెండితెరపై ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. వీళ్ళందరూ హీరో, హీరోయిన్లు గా మారి వరస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రస్తుతం అదే స్టార్ హీరోకు జోడిగా నటిస్తుంది. ఈ హీరోయిన్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ప్రస్తుతం ఈమె తెలుగుతోపాటు తమిళ్ సినిమాలలో కూడా బిజీగా ఉంది.
సెప్టెంబర్ 21, 2003 కర్ణాటకలోని మంగళూరులో కృతి శెట్టి జన్మించింది. ఈమె కర్ణాటకలో పుట్టినప్పటికీ ముంబైలో పెరిగింది. కృతి శెట్టి తండ్రి కృష్ణ శెట్టి బిజినెస్ మాన్, ఇక తల్లి నీతి శెట్టి ఫ్యాషన్ డిజైనర్. కృతి శెట్టి చిన్నతనంలోనే ఐడియా, పార్లే, లైఫ్ బాయ్, షాపర్స్ స్టాప్ వంటి పలు ప్రముఖ బ్రాండ్ల యాడ్స్ లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ట్ చేసింది. 2019లో రిలీజ్ అయిన హిందీ సినిమా సూపర్ 30 లో కృతి శెట్టి చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమాకు ముందు కార్తి హీరోగా నటించిన నా పేరు శివ మూవీ లో కూడా ఈమె ఒక చిన్న పాత్రలో నటించింది. ప్రస్తుతం కృతి శెట్టి కార్తీ హీరోగా చేస్తున్న సినిమాలో కార్తీకు జోడుగా నటిస్తుంది. వా వాతియార్ అనే సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వ వహిస్తున్నారు.
View this post on Instagram