Homeఎంటర్టైన్మెంట్Sushanth Singh: నేషనల్ అవార్డును సుశాంత్ సింగ్ కు అంకితం ఇచ్చిన "చిచోరే" టీమ్ ...

Sushanth Singh: నేషనల్ అవార్డును సుశాంత్ సింగ్ కు అంకితం ఇచ్చిన “చిచోరే” టీమ్ …

Sushanth Singh: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంతో మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రగా నిలిచిపోయారు. ఈ యువ హీరో ఎమ్మెస్ ధోనీతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చారు సుశాంత్.  బ్యాక్ గ్రౌండ్  డాన్సర్ గా, సీరియల్ నటుడిగా, హీరోగా ఎదిగారు సుశాంత్.  స్టార్ హీరోగా గుర్తింపు పొందే సమయంలో కొన్ని అనివార్య కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం అందరికి తెలిసిందే.

chichore team dedicates national award to sushanth singh rajputh

ఇటీవలే 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ఉత్సవం జరిగింది. సినీ నటులకు జాతీయ చలనచిత్ర అవార్డులు ఒక పండుగ వంటిదని చెప్పవచ్చు. తమ నటనకు దొరికే గౌరవం ఫలంగా భావిస్తారు. సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ హీరోగా నటించిన ‘చిచోరే’ సినిమా నేషనల్ అవార్డు అందుకుంది. ఈ అవార్డును అందుకున్న ఈ సినిమా నిర్మాత సాజిద్ నడియావాలా… డైరెక్టర్ నితీష్ తివారీ సుశాంత్  నటన గురించి… సినిమాలపై ఆయన కున్న ఆసక్తిని మరోసారి గుర్తు చేసుకున్నారు. సుశాంత్ నటన పరంగానే కాకుండా సామాన్యులతో కూడా మన మనిషిలా ప్రవర్తిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన లేని లోతు ఎప్పటికీ తీరదనే చెప్పాలి.

ఈ అవార్డును సుశాంత్‌కు అంకితం చేశారు చిత్రా బృందం. ఈ మేరకు సుశాంత్‌కు నేషనల్ అవార్డును అంకితం ఇచ్చిన చిచోరే మూవీ బృందాన్ని సుశాంత్ సోదరి శ్వేత సుశాంత్ అభినందించారు. అలానే మూవీ టీం తో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సుశాంత్ ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular