Chhaava : ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాలలో ఒకటి విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన ‘చావా'(Chhaava Movie). టేకింగ్, నటీనటుల నటన, అద్భుతమైన నేపధ్య సంగీతం, ఇలా అన్ని పర్ఫెక్ట్ గా కుదరడంతో ఈ సినిమా బాలీవుడ్ లో 500 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి, 600 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. మార్చి 7వ తారీఖున తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది. తెలుగులో కూడా తెరెస్పాన్సే ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు టాలీవుడ్ లో 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. థియేటర్స్ లో ఇంతటి అద్భుతమైన థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ లో విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉందట.
Also Read : 3 రోజుల్లో 1,80,000 టిక్కెట్లు..’చావా’ తెలుగు వెర్షన్ కి కాసుల కనకవర్షం..గ్రాస్ ఏ రేంజ్ లో వచ్చిందంటే!
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. కేవలం హిందీ వెర్షన్ దాదాపుగా 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. ఇతర భాషలకు సంబంధించిన డబ్బింగ్ రైట్స్ MADDOK సంస్థ అమ్మలేదట. కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే మనం నెట్ ఫ్లిక్స్(Netflix) లో చూడగలం. కానీ రీసెంట్ గానే తెలుగు లో డబ్ చేసి విడుదల చేసారు కాబట్టి, తెలుగు వెర్షన్ వరకు ఆహా మీడియా లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇతర భాషల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కానీ ఎందుకు MADDOK సంస్థ డబ్ చేయడానికి ఆసక్తి చూపడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. బాలీవుడ్ లో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘స్త్రీ 2’ చిత్రాన్ని కూడా థియేట్రికల్, ఓటీటీ కేవలం హిందీ వెర్షన్ కి మాత్రమే పరిమితం చేసారు.
ఇకపోతే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని ఏప్రిల్ 11 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజున తెలుగు వెర్షన్ ని కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు కానీ, ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీ లో అంతకు మించిన గొప్ప రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది., మన చరిత్ర గురించి సినిమాగా తీస్తే కచ్చితంగా చూడాలనే ఆశతో ప్రతీ భారతీయుడు ఉంటాడు. అందుకే ఈ సినిమాకి థియేటర్స్ లో కంటే ఓటీటీ లోనే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి.
Also Read : చావా’ లో ‘ఔరంగజేబు’ క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న క్రేజీ యంగ్ హీరో అతనేనా..? చేసుంటే వేరే లెవెల్ ఉండేది!