Chhaava Movie : ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ఎన్నో అద్భుతాలను నెలకొల్పిన చిత్రం ‘చావా'(Chhaava Movie). ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని విక్కీ కౌశల్(Vicky Kaushal) హీరో గా నటించిన ఈ సినిమా, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తుంది. నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి బుక్ మై షో(Book My Show) యాప్ లో 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రం కమర్షియల్ గా ఏ రేంజ్ కి వెళ్ళింది అనేది. అందుకే విడుదలై 50 రోజులు కావొస్తున్నా ఇంకా ఓటీటీ లోకి రాలేదు. కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే కాదు, తెలుగు వెర్షన్ లో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ వసూళ్లు వచ్చాయి. అయితే ఓటీటీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : ఊర్లో ఒకే ఒక్క అమ్మాయి..యాంకర్ ప్రదీప్ కొత్త మూవీ ట్రైలర్!
అలా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఒక శుభవార్త. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11 వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి వస్తుందా, లేదా తెలుగు వెర్షన్ కూడా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. తెలుగు వెర్షన్ రైట్స్ ని నిర్మాత అల్లు అరవింద్ భారీ రేట్ కి కొనుగోలు చేశాడు. ఆయనకు ఆహా మీడియా యాప్ ఉంది కాబట్టి, తెలుగు వెర్షన్ అందులోనే రిలీజ్ అవుతుందా అనే సందేహం ప్రేక్షకుల్లో కలుగుతుంది. MADDOCK సంస్థ కు ఎందుకో అన్ని ప్రాంతీయ భాషల్లో తన సినిమాని విడుదల చేయాలనే తలంపు మొదటి నుండి లేదు. గత ఏడాది ఇదే సంస్థ నుండి స్త్రీ 2 చిత్రం విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా అంతే, కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే థియేటర్స్ లో విడుదలైంది.
కనీసం ఓటీటీ లో అయినా అన్ని భాషల్లో విడుదల చేస్తారని అనుకుంటే, అది జరగలేదు. ఇప్పుడు ‘చావా’ చిత్రానికి కూడా అదే రిపీట్ చేయబోతున్నారా అనే సందేహం ఉంది. ఇది మన దేశ విశిష్ట చరిత్రకు సంబంధించిన కథ. కచ్చితంగా ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిందే. కాబట్టి నెట్ ఫ్లిక్స్ లో హిందీ తో పాటు తెలుగు, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి వస్తే బాగుంటుందని విశ్లేషకుల అభిప్రాయం, మరి మేకర్స్ మదిలో ఏముందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) నటించగా, ఔరంగజేబు క్యారక్టర్ లో అక్షయ్ ఖన్నా నటించాడు. థియేటర్స్ లో ఎవరైనా ఈ సినిమా మిస్ అయ్యుంటే, మర్చిపోకుండా ఓటీటీ లో చూడండి. చివరి 30 నిమిషాలు చూస్తే థియేటర్స్ లో ఇలాంటి అద్భుతాన్ని ఎలా మిస్ అయ్యాను రా బాబు అని అనుకుంటారు.
Also Read : రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిన ‘బేబీ’ హీరోయిన్..భయపడుతున్న నిర్మాతలు!