Chhaava Movie : ఒక్క అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అరెస్ట్ విషయం ఒక్కటి పక్కన పెడితే, అల్లు ఫ్యామిలీ కి అదృష్ట దేవత నెత్తి మీద తాండవిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘పుష్ప 2′(Pushpa 2 Movie) దేశం లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఇక ఆయన తండ్రి అల్లు అరవింద్(Allu Aravind) గత నెలలో నాగచైతన్య తో ‘తండేల్'(Thandel Movie) అనే చిత్రాన్ని తీసి భారీ లాభాలను అందుకున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా బాలీవుడ్ సెన్సేషన్ సృష్టించిన ‘చావా'(Chhaava Movie) చిత్రాన్ని తెలుగు లో డబ్బింగ్ చేసి మార్చి 7 న గ్రాండ్ గా విడుదల చేసారు. మూడు వారాల తర్వాత విడుదలైనప్పటికీ కూడా ఈ సినిమాకు తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. తెలుగులోకి డబ్ చేసి, ఆ తర్వాత పబ్లిసిటీ మెటీరియల్ కోసం రెండు నుండి మూడు కోట్ల రూపాయిల ఖర్చు అల్లు అరవింద్ కి అయ్యుండొచ్చు.
Also Read : 3 రోజుల్లో 1,80,000 టిక్కెట్లు..’చావా’ తెలుగు వెర్షన్ కి కాసుల కనకవర్షం..గ్రాస్ ఏ రేంజ్ లో వచ్చిందంటే!
కానీ ఈ సినిమాకి పది రోజుల్లో 16 కోట్ల రూపాయిల గ్రాస్, 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అంటే దాదాపుగా 5 కోట్ల రూపాయిల లాభాలు అన్నమాట. గత నెలలో ‘తండేల్’ చిత్రంతో భారీ లాభాలను మూటగట్టుకున్న అల్లు అరవింద్, మరుసటి నెలలో కూడా అదే రేంజ్ లో లాభాలను రాబట్టుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా తన తోటి నిర్మాతలతో పోలిస్తే రెగ్యులర్ గా సినిమాలు చేయడం తగ్గించిన అల్లు అరవింద్, ఇప్పుడు ఈ రెండు సినిమాల ద్వారా భారీ కం బ్యాక్ ఇచ్చాడని అనుకోవచ్చు. ఇదే ఊపులో త్వరలోనే ఆయన నాగ చైతన్య తో మరో సినిమా చేయనున్నాడు. అదే విధంగా సూర్య తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. మళ్ళీ రెగ్యులర్ గా సినిమాలను నిర్మిస్తూ ఫుల్ బిజీ గా మారిపోబోతున్నాడు అల్లు అరవింద్.
కానీ ఈయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తాడా, లేకపోతే ఇలాంటి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకే పరిమితం అవుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే చావా చిత్రం హిందీ లో ఇప్పటికీ డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. 5వ వీకెండ్ లో ఈ చిత్రానికి దాదాపుగా 22 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ‘పుష్ప 2’ చిత్రానికి కేవలం 14 కోట్లు మాత్రమే నెట్ వసూళ్లు 5వ వీకెండ్ లో వచ్చాయి. ఓవరాల్ గా 5 వారాలకు కలిపి చావా చిత్రం 562 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. IPL సీజన్ లో వసూళ్ల పై ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ, ఈ వారం తో ఈ చిత్రం 600 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్.
Also Read : 1500 సార్లు టీవీలో టెలికాస్ట్..వరల్డ్ రికార్డు నెలకొల్పిన మహేష్ బాబు!