Chhaava Collection (1)
Chhaava Collection: ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరోచిత గాధని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ‘చావా'(Chhaava Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు ముందే ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించింది ఈ చిత్రం. ఇక విడుదల తర్వాత ఓపెనింగ్ వసూళ్లు ఏ రేంజ్ లో వచ్చాయో మనమంతా చూసాము. మొదటి వీకెండ్ లో 130 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా వీక్ డేస్ లో పడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం రోజున 24 కోట్లు, మంగళవారం రోజున 26 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రోజురోజుకి పెరుగుతూ పోతున్న ఈ వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అవ్వడంతో ఈ సినిమా మహారాష్ట్ర ప్రాంతం లో సంచలనమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది. ‘పుష్ప 2′(Pushpa 2 The Rule) కి ఇందులో పావు శాతం కూడా లేదని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంటున్నారు. ఆరవ రోజున ఈ చిత్రానికి దాదాపుగా 30 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయట. దీంతో ఈ చిత్రం 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్ల మార్కుని దాటేసింది. నిన్నమొన్నటి వరకు సాధారణమైన హీరో గా ఇండస్ట్రీ లో కొనసాగిన విక్కీ కౌశల్(Vicky Kaushal), ఈ చిత్రం తో స్టార్ హీరో గా మారిపోయాడు. నిన్న ఒక్క రోజే ఈ సినిమాకి బుక్ మై షో యాప్ లో 6 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. పుష్ప 2 తర్వాత మామూలు వర్కింగ్ డేస్ లో ఈ స్థాయిలో టికెట్స్ సేల్ అవ్వడం ఈ సినిమాకే మనం చూస్తున్నాం. పుష్ప 2 చిత్రానికి మొదటి పది రోజులు 1 మిలియన్ కి తగ్గకుండా టికెట్స్ అమ్ముడుపోయాయి.
కానీ ఆ సినిమాకి టాలీవుడ్ మార్కెట్ పెద్ద ప్లస్, అదే విధంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో కూడా సమానమైన క్రేజ్ ఉండేది. అందుకే అ స్థాయి టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ ఈ చిత్రానికి మాత్రం కేవలం హిందీ మార్కెట్ తప్ప మరొకటి లేదు. కేవలం ఒక్క భాషకు సంబంధించి ఇన్ని లక్షల టిక్కెట్లు అమ్ముడుపోవడం అనేది సాధారణమైన చిన్న విషయం కాదు. ఒకవేళ ఈ సినిమాకి ఇతర భాషల్లో కూడా డబ్ చేసి ఉండుంటే ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవి. మన చరిత్రకు సంబంధించిన కథ ని కచ్చితంగా అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు చూసి తెలుసుకోవాలి. అలాంటిది ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేయకపోవడం నిర్మాతలు చేసిన చారిత్రక తప్పిదం. రాబోయే రోజుల్లో అయినా, పెరుగుతున్న డిమాండ్ ని చూసి, ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేస్తారో లేదో చూడాలి.