Chhaava
Chhaava: ఎలాంటి అంచనాలు లేకుండా మరాఠాల వ్యతిరేకత మధ్య విడుదలైన ఛావా సినిమా ఇప్పుడు ఇండస్ట్రీని ఫేక్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. భారీగా ఆదరణ పొందుతూ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాస్ట్రాల ప్రేక్షకులను సినిమా క్లైమాక్స్(Climax) విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాకు వచ్చినవారు థియేటర్లలో నిలబడి భావోద్వేగానికి గురవుతుఆన్నరు. సీట్లపై నిలబడి జై శంబాజీ అంటు నినాదాలు చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరైతే ఏకంగా గుర్రాలపై థియేటర్లకు వస్తున్నారు. శివాజీ(Shivaji) వేషధారణలో ఆకట్టుకుంటున్నారు. ఇవన్నీ పాజిటివ్‌గా చెప్పుకునే అంశాలు. దీనికి మరో కోణం కూడా ఉంది. సినిమాలో విలన్ హింసను తట్టుకోలేకపోతున్నారు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
స్క్రీన్ చించేసి..
గుజరాత్ రాష్ట్రంలోని భరుచ్(Bharuch) నగరంలో ఉన్న ఆర్కే సినిమా మల్టీప్లెక్స్‌లో ఛావా(Chava) సినిమా చూసేందుకు వచ్చిన ఓ ప్రేక్షకుడు హింసను భరించలేక ఏకంగా స్క్రీన్‌ను చించేశాడు. జయేష్ వాసవ అనే వ్యక్తి మద్యం తాగి సెకండ్‌షో సినిమా చూసేందుకు వచ్చాడు. మద్యం తాగిన వాసన తెలిలయకుండా సిబ్బందిని మేనేజ్ చేసి థియేటర్లోకి వెళ్లాడు. రాత్రి 11:45 గంటల సమయంలో హఠాత్తుగా స్క్రీన్‌పై విరుచుకుపడ్డాడు. నిప్పును ఆర్పే ఎక్స్ టింగిషన్తో చించేయడం మొదలు పెట్టాడు. దానికి కారణం ఏంటని అడిగితే శంభాజీ మహారాజ్‌ను ఔరంగజేబు(ourangajeb) చిత్రహింసలు పెట్టడం తట్టుకోలేక ఆ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాని చంపాలనే ఉద్దేశంతో దాడి చేశానని తెలపాడు. ఇది జరిగినంతసేపు హాల్లో తీవ్ర కలకలం రేగింది.
రూ.2 లక్షల నష్టం..
ఇదిలా ఉంటే.. జయేష్ వసవ చేసిన పనికి థియేటర్‌కు సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వచ్చింది. మరుసటి రోజు షోలన్నీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. వాటిని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులకు రిఫండ్ చేశారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు జయేష్ వాసవని అరెస్టు చేశారు. కేసు నమోదు చేశారు. అతను ఎమోషనల్‌లో చేసినప్పటికీ రెండు వందల రూపాయల టికెట్ పెట్టి చేసిన నష్టం లక్షలకు చేరుకుంది. ఈ ఘటన పక్కకు పెడితే ఛావా సినిమా ప్రేక్షకులను ఏస్థాయిలో ఆకట్టుకుంటుంది అనేందుకు ఇది ఉదాహరణ. ప్రేక్షకాదరణకు నిదర్శనం. ఇక మహారాష్ట్రలో అయితే జాతరకు వెళ్లినట్లుగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు.
#Chhaava ફિલ્મના નાઈટ શોમાં એક વ્યક્તિ આવ્યો અને સ્ક્રિનનો પરદો ફાડી નાખ્યો!
ઘટનાઃ blue chip complex, Bharuch#Bharuch #Chhava #VickyKaushal #multiplex #screen #Damage #bluechipcomplex pic.twitter.com/nVMEnDo8Zz
— MG Vimal – વિમલ પ્રજાપતિ (@mgvimal_12) February 17, 2025
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Chhaava an emotional fan from gujarat who tears up the theater screen in a violent scene
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com