spot_img
Homeఎంటర్టైన్మెంట్Chennai Love Story First Day Collections: 'చెన్నై లవ్ స్టోరీ' మొదటిరోజు వరల్డ్ వైడ్...

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్ అబ్బవరం కి ఈ రేంజ్ గ్రాస్ ఊహించలేదు..

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఫస్ట్ షోస్ లోపు , ఆడియన్స్ పెరిగే కొద్దీ ఈ చిత్రానికి మంచి టాక్ సెటిల్ అయ్యింది . దీంతో ఓపెనింగ్స్ ప్రతీ ప్రాంతం లోనూ అదిరిపోయాయి. ముఖ్యంగా అర్బన్ సెంటర్స్ లో ఈ చిత్రానికి నమోదైన వసూళ్లను చూసి ట్రేడ్ షాక్ కి గురైంది. కిరణ్ అబ్బవరం సినిమాకు ఇలాంటి ఓపెనింగ్స్ ని అసలు ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. విడుదలకు ముందు ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మరి మొదటి రోజు ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు వివరంగా చూడబోతున్నాము.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి అక్షరాలా 2 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది సాధారంభమైన విషయం కాదు. షేర్ వసూళ్లు అయితే నైజాం ప్రాంతం నుండి 1 కోటి 12 లక్షల రూపాయిలు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 50 లక్షల రూపాయిలు వచ్చాయి. అదే విధంగా వైజాగ్ నుండి 33 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 24 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 18 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 19 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 20 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 2 కోట్ల 87 లక్షల రూపాయిల షేర్ షేర్ వసూళ్లు , 5 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కర్ణాటక నుండి ఈ చిత్రానికి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, చెన్నై + ఇతర రాష్ట్రాల నుండి 10 లక్షల గ్రాస్ , 4 లక్షల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. ఓవరాల్ ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 5 కోట్ల 70 లక్షల గ్రాస్, 3 కోట్ల 9 లక్షల షేర్ వచ్చింది. అదే విధంగా నార్త్ అమెరికా నుండి 2 కోట్ల గ్రాస్ వసూళ్లు , 80 లక్షల షేర్ వసూళ్లు రాగా, రెస్ట్ ఆఫ్ వరల్డ్ నుండి 60 లక్షల గ్రాస్ , 24 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 8 కోట్ల 30 లక్షల గ్రాస్ వసూళ్లు , 4 కోట్ల 13 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదంతా జీఎస్టీ లేకుండానే , జీఎస్టీ కలుపుకుంటే 5 నుండి 6 కోట్ల రూపాయిల షేర్ మధ్యలో మొదటి రోజు వసూళ్లు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper