Bollywood Sequel Films: బాలీవుడ్ ఇండస్ట్రీ సీక్వెల్ సినిమాల పైన ఎక్కువగా ఆధారపడుతుంది. ఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలు దానికి వెంటనే సీక్వెల్ చేసి దానికి ఉన్న హైప్ ను క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ‘దురంధర్’ సినిమా సూపర్ సక్సెస్ అయిన వెంటనే ఇప్పుడు ‘దురంధర్ 2’ సినిమాని సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత 10 సంవత్సరాల లో మొత్తం సీక్వెల్ సినిమాలపైనే ఫోకస్ పెట్టిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటికైనా కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి ప్రేక్షకులను మెప్పిస్తే బాగుంటుందంటూ పలువురు సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ వాళ్లు ఈ మధ్యకాలంలో గొప్ప సినిమాలను చేయలేకపోతున్నారు. వాళ్ళ నుంచి వచ్చే సినిమాలేవి ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా వరకు వెనుకబడిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ సైతం బాలీవుడ్ ఇండస్ట్రీ ని డామినేట్ చేసి ముందుకు దూసుకెళ్తుంది. అంటే అక్కడ గొప్ప కథలు రాకపోవడమే కారణం అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
ఇక ఇప్పటికైనా సీక్వెల్స్ ను నమ్ముకోకుండా మంచి కథలతో వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తే బాగుంటుందంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఖాన్ త్రయం హీరోలలో షారుక్ ఖాన్ ను మినహాయిస్తే సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఏమాత్రం వాళ్ల సత్తాని చాటుకోలేకపోతున్నారు.
షారుఖ్ ఖాన్ సైతం పఠాన్, జవాన్ సినిమాలతో 1000 కోట్ల మార్కును టచ్ చేశాడు. అతన్ని మినహాయిస్తే మిగిలిన హీరోలెవరు ఆ రేంజ్ సక్సెస్ ను సాధించలేకపోతున్నారు… రన్బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలు సైతం 1000 కోట్ల మార్కును టచ్ చేశారు… ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ తేరుకొని గొప్ప సినిమాలను చేస్తే బాగుంటుంది.
లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీలో సైతం బాలీవుడ్ ని డామినేట్ చేసే పరిస్థితి రావచ్చు. ఒకప్పుడు బాలీవుడ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా గొప్ప నిర్మాణ విలువలతో ఉండడమే కాకుండా గొప్ప కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేవి అనే పేరైతే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పేరు లేకుండా పోయింది…