https://oktelugu.com/

రసకందాయంలో టెక్కలి నియోజకవర్గం..!

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఇప్పుడు హాట్ నియోజకవర్గంగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో దూకుడు మీదుండగా.. అంతే స్థాయిలో వైసీపీ ఇన్ చార్జి దువ్వాడ శ్రీనివాస్  ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో పోరు ఉండగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కు అదనపు బలం చేకూరింది. దీంతో ఇక దువ్వాడను అచ్చెన్నాయుడు తట్టుకునేనా..? అన్న చర్చ సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 28, 2021 4:57 pm
    Follow us on

    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఇప్పుడు హాట్ నియోజకవర్గంగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో దూకుడు మీదుండగా.. అంతే స్థాయిలో వైసీపీ ఇన్ చార్జి దువ్వాడ శ్రీనివాస్  ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో పోరు ఉండగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కు అదనపు బలం చేకూరింది. దీంతో ఇక దువ్వాడను అచ్చెన్నాయుడు తట్టుకునేనా..? అన్న చర్చ సాగుతోంది.

    గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన దువ్వాడి శ్రీనివాస్ అచ్చెన్నాయుడి మీద స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్న ఆయన ఎమ్మెల్యే అయిన అచ్చెన్నాయుడికి పోటాపోటీగా ఉంటున్నారు. ప్రభుత్వం తరుపున చేపట్టే కార్యక్రమాలు దువ్వాడ ముందుండి నడిపించడంతో ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడికి కంట్లో నలుసులాగా మారుతున్నాడు. అయితే ఎంతగా అధికార పార్టీలో ఉన్నా తనకంటూ ఓ పదవి లేదనే లోటు ఉండేది.

    తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ ను పిలిచి మరీ ఎంఎల్ సీ పదవి అప్పగించనున్నారట. దీంతో నియోజకవర్గ హోదాలోనే దూకుడుగా వ్యవహరించిన దువ్వాడ, ఇక ఎమ్మెల్సీ హోదాలో ఏ రేంజ్ లో రెచ్చిపోతారోనన్న చర్చ జరుగుతోంది. త్వరలో మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సీఎం జగన్ గకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను గిప్ట్ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది.

    అటు టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఉన్న అచ్చెన్న సైతం ప్రతీ ఆందోళనలో ముందుంటుడగా ఇప్పుడు దువ్వాడ ఏ స్థాయిలో కౌంటర్  ఇస్తారోనని అనుకుంటన్నారు. మొత్తానికి టెక్కలిలో రసకందమైన రాజకీయం మొదలు కానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.