https://oktelugu.com/

Sai Dharam Tej: ‘సాయి తేజ్’లో మార్పులు.. షాక్ లో ఫ్యామిలీ, ఫ్యాన్స్ !

Sai Dharam Tej: యంగ్ హీరో ‘సాయి ధరమ్ తేజ్’ రోడ్డు ప్రమాదానికి గురి అయినప్పటి నుంచీ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు. ఇన్నాళ్లు కొత్త సినిమా ముచ్చట్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా తన ఫ్యాన్స్ కి కూడా తన సినిమాలకు సంబంధించి ఎటువంటి సందేశం ఇవ్వలేదు. ఐతే బ్రేక్ పడిన ‘సాయి తేజ్ 15’ సినిమా పట్టాలెక్కనుంది. యంగ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో వచ్చే నెల మూడో వారం నుంచి ఈ ప్రాజెక్ట్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 21, 2022 / 05:46 PM IST
    Follow us on

    Sai Dharam Tej: యంగ్ హీరో ‘సాయి ధరమ్ తేజ్’ రోడ్డు ప్రమాదానికి గురి అయినప్పటి నుంచీ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు. ఇన్నాళ్లు కొత్త సినిమా ముచ్చట్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా తన ఫ్యాన్స్ కి కూడా తన సినిమాలకు సంబంధించి ఎటువంటి సందేశం ఇవ్వలేదు. ఐతే బ్రేక్ పడిన ‘సాయి తేజ్ 15’ సినిమా పట్టాలెక్కనుంది.

    Sai Dharam Tej

    యంగ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో వచ్చే నెల మూడో వారం నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుంది. యాక్సిడెంట్ తర్వాత.. సాయి తేజ్ చేస్తున్న తొలి సినిమా ఇదే. అందుకే, ఈ సినిమా పై ప్రత్యేక ఆకర్షణ ఉంది. అయితే.. సాయి తేజ్ ఫోకస్ మారింది. ఎందుకంటే సాయి తేజ్ కి అసలు విషయం అర్ధం అయిందట.

    Also Read: Kieron Pollard: కీరన్ పోలార్డ్ ఎందుకిలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు?

    ఇన్నాళ్లు విషయం లేకుండా సినిమాలు చేశాను అని, మధ్యలో యాక్షన్ చేశాను అని, అసలు తాను యాక్షన్ చేస్తే ఎవ్వరూ చూడరని సాయి తేజ్ ఫిక్స్ అయ్యాడట. ఇకపై చేసే సినిమాలు, ఎన్నుకునే కథల విషయంలో కాస్త డీప్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సాయి తేజ్ డిసైడ్ అయ్యాడు.

    ఇటీవలే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక మూవీ ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది యాక్షన్ చిత్రమే. కాకపోతే, సత్తారు విషయమున్న దర్శకుడు కాబట్టి సాయి ధరమ్ తేజ్ సినిమా ఒప్పుకున్నాడు. కానీ.. ఈ సినిమా విషయంలో కూడా సాయి ధరమ్ తేజ్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మళ్లీ యాక్షన్ జోలికి వెళ్లడం అవసరమా ? అంటూ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.

    ఇక నుంచి తాను ఎక్కువగా కామెడీ సినిమాలే చేయాలని సాయి ధరమ్ తేజ్ ప్లాన్ చేస్తున్నాడు. పైగా కంటెంట్ ఉన్న డైరెక్టర్లతోనే పని చేయాలని కమిట్ అయ్యాడు. మెయిన్ గా ఇకపై కొత్త దర్శకులు తెచ్చే కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సాయి ధరమ్ తేజ్ అనుకుంటున్నాడట. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ లో చాలా మార్పులు వచ్చాయి.

    Also Read: CM Jagan: రాజ్యసభ సభ్యులుగా ఎవరికి అవకాశం ఇస్తారో

    Recommended Videos:

    Tags