Chandra Mohan: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న చంద్రమోహన్…ఎవరికి ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవితో చంద్రమోహన్ అనేక చిత్రాలు చేశారు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో వీరిద్దరూ ప్రధానంగా కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ప్రాణం ఖరీదు, తాయారమ్మ బంగారయ్య చిత్రాల్లో చంద్రమోహన్, చిరంజీవి నటించారు.

Written By: NARESH, Updated On : November 11, 2023 1:06 pm

Chandra Mohan

Follow us on

Chandra Mohan: కొందరు నటులు మాత్రమే సుదీర్ఘ కాలం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటారు. వారిలో చంద్రమోహన్ ఒకరు. పాత్ర ఏదైనా చంద్రమోహన్ పరకాయ ప్రవేశం చేస్తారు. సహజమైన నటనతో ఆకట్టుకుంటారు. హీరోగా వెండితెరకు పరిచయమైన చంద్రమోహన్ విలక్షణమైన పాత్రలు చేశారు. లవ్ రొమాంటిక్స్, క్లాసిక్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఆయన హీరోగా నటించారు. హీరోగా ఆఫర్స్ వస్తున్నా స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్, సెకండ్ హీరో రోల్స్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవితో చంద్రమోహన్ అనేక చిత్రాలు చేశారు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో వీరిద్దరూ ప్రధానంగా కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ప్రాణం ఖరీదు, తాయారమ్మ బంగారయ్య చిత్రాల్లో చంద్రమోహన్, చిరంజీవి నటించారు. కాగా ఈ సినిమాల నాటికి చంద్రమోహన్ రెమ్యూనరేషన్ చిరంజీవి కంటే చాలా ఎక్కువగా ఉండేదట. ఈ విషయాన్ని చంద్రమోహన్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు.

చిరంజీవి కంటే నేను చాలా సీనియర్ ని. అప్పుడు నా రెమ్యూనరేషన్ చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ. ప్రాణం ఖరీదు సినిమా నాటికి నాకు రూ. 25 వేలు ఇస్తే, చిరంజీవికి రూ. 5 వేలు ఇచ్చేవారు. చిరంజీవి చాలా మంచి వ్యక్తి. నటుడిగా ఎదగాలనే తపనతో ఉండేవాడు. చిరంజీవి డాన్సులు గురించి అప్పట్లో చెప్పుకునేవారు. చిరంజీవికి ముందు పరిశ్రమలో డాన్సర్స్ అంటే నేను, ఏఎన్నార్ మాత్రమే.

చిరంజీవి తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. చిరంజీవి కెరీర్లో ఎదగడంలో అల్లు అరవింద్ పాత్ర ఎంతగానో ఉంది. చిరంజీవి అర్జునుడు అయితే అల్లు అరవింద్ కృష్ణుడు లాంటి వాడు. చిత్రాలు, బ్యానర్స్ ఎంపికలో అల్లు అరవింద్ చిరంజీవిని గైడ్ చేసేవాడు. అల్లు అరవింద్ సారథ్యంలో చిరంజీవి స్టార్ గా ఎదిగాడని చంద్రమోహన్ చెప్పుకొచ్చాడు.